పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ రీమేక్ గా చేస్తున్న సినిమాకు వకీల్ సాబ్ టైటిల్ ఫిక్స్ చేశారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా పవర్ స్టార్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చేలా ఈ పోస్టర్ ఉంది. అయితే పవన్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎదురుచూసి దాని మీద సెటైర్ వేసే ఆర్జివి వకీల్ సాబ్ పోస్టర్ మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వకీల్ సాబ్ పోస్టర్ ను యాడ్ చేసి డైరక్టర్ సాబ్ పోస్టర్ ఒకటి పెట్టాడు ఆర్జివి.

 

అంతేకాదు తన మార్క్ కామెంట్ తో మళ్లీ పవర్ స్టార్ మీద తన కసి చూపించాడు. కొంతమంది ఇడియట్స్ గురించి తను ఆలోచించను. ఇలాంటి ఇడియట్ పనులు చేయనని.. వకీల్ సాబ్ పోస్టర్ పై తన కామెంట్ పెట్టాడు ఆర్జివి. పవన్ అంటేనే అంతెత్తున లేచే వర్మ వకీల్ సాబ్ పోస్టర్ పై ఈ విధంగా రెస్పాండ్ అవడంలో పెద్దగా విచిత్రం ఏమి లేదు. అయితే వర్మ కావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మళ్లీ రెచ్చగొట్టేందుకే ఇలాంటివి చేస్తుంటాడు. వకీల్ సాబ్ పోస్టర్ కు ధీటుగా డైరక్టర్ సాబ్ అంటూ వర్మ కూడా టేబుల్ మీద కాళ్లు పెట్టిన పోస్టర్ ఒకటి పెట్టాడు.

 

ఇక వకీల్ సాబ్ విషయానికి వస్తే మే నెలలో ఈ సినిమా రిలీజ్ అవడం కన్ ఫాం అని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్య ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ కూడా పవన్ తో సినిమా చేసేందుకు లైన్ లో ఉన్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: