సింగం సిరీస్ కు ఎండ్ కార్డ్ వేశారు. అయితే సింగం కాంబినేషన్ మాత్రం కంటిన్యూ కాబోతోంది. మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన దర్శకుడు హరితో సూర్య మరో పవర్ ప్యాక్ స్టోరీ చేయబోతున్నాడు. మరోసారి బాక్సాఫీస్ వద్ద విజిల్స్ వేయించేందుకు ఈ కాంబినేషన్ రెడీ అవుతోంది. 

 

ప్రయోగాత్మక చిత్రాల హీరోగా పేరున్న సూర్యకు సింగం సిరీస్ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దర్శకుడు హరి, సూర్యను హై ఓల్టేజ్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసి బాక్సాఫీస్ వద్ద విజిల్స్ వేయించాడు. సింగం సిరీస్ లో వచ్చిన మొదటి రెండు భాగాలు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో భారీ సక్సెస్ సాధించాయి. ఇదే కోవలో వచ్చిన థర్డ్ పార్ట్ పూర్తిగా నిరాశపరిచింది. దీంతో సింగం సిరీస్ కు ఎండ్ కార్డ్ వేశారు. 

 

సింగం సిరీస్ లో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. థియేటర్స్ లో సూర్య డైలాగ్స్ కు మాస్ ఆడియన్స్ ఊగిపోయారు. అయితే సింగం 3 మరి రొటీన్ గా ఉండటంతో బోల్తా కొట్టింది. దీంతో సింగం ఫ్రాంచైజీకి ప్రస్తుతం డైరెక్టర్ ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రస్తుతం ఈ మాస్ కాంబినేషన్ సరికొత్త యాక్షన్ మూవీ చేసేందుకు రెడీ అవుతోంది. 

 

దర్శకుడు హరి, సూర్యతో అరువా అనే యాక్షన్ ఎంటర్ టైనర్ కు ప్లాన్ చేస్తున్నాడు. అరువా అంటే తమిళ్ లో కత్తి అని అర్థం. టైటిల్ బట్టి సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలిసిపోతోంది. ఈ సినిమాలో యాక్షన్ డోస్ మరింత పెంచనున్నట్టు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఆధ్వర్యంలో ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. ప్రస్తుతం సూర్య సుధ కొంగర దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి బాక్సాఫీస్ వద్ద విజిల్స్ వేయించేందుకు ఈ కాంబినేషన్ రెడీ అవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: