బన్ని..అల్లు అర్జున్..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ...ఇలా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో గ్రాండ్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఆర్తీ అగర్వాల్ చెల్లెలు అదితీ అగర్వాల్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. అయితే అల్లు అర్జున్ కి ఈ సినిమాతో హీరోగా ఎంటరయ్యాడని తెలిసిన విషయమే. కానీ వాస్తవంగా అల్లు అర్జున్ టాలీవుడ్ కి ఎప్పుడో ఎంటర్ అయ్యాడు.

 

మెగాస్టార్ చిరంజీవి సిమ్రన్ జంటగా నటించిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ మొదటిసారిగా కనిపించాడు. అద్బుతంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. చిరంజీవి సోలో సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ చేస్తూ కనిపించిన ఒక కుర్రాడు ఎవరూ అని ఆరా తీసేంతగా ఆ సాంగ్ లో తనని తాను బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమానే గంగోత్రి. మొదటి సినిమాతోనే యాక్టింగ్, డాన్స్, ఫైట్స్  ..అన్నిటిలోను ఆరితేరిపోయాడు మంచి సినిమాలు పడితే టాలీవుడ్ లో స్టార్ హీరో అవడం ఖాయం అన్న టాక్ ని సంపాదించుకున్నాడు. 

 

అదే విధంగా అల్లు అర్జున్ ఈరోజు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇంకా చెప్పాలంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ అనుకునేలా చేశాడు. ఆర్య సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. బన్ని, ఆర్య 2, దేశ ముదురు, జులాయి, సన్నాఫ్ సత్య మూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాధం, ఇద్దరమ్మాయిలతో , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రీసెంట్ గా అల వైకుంఠపురములో ఇలా ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తన ఇమేజ్ ని ఎప్పటికప్పుడు అమాంతం పెంచుకుంటూ పోతున్నాడు.

 

ఇక ఈ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమా వసూళ్ళ పరంగా రికార్డ్స్ ని సృష్ఠించింది. అయితే ఈ స్టైలిష్ స్టార్ కి యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ లో ఇలా ప్రతీ దాంట్లో ఇన్సిప్రేషన్ మావయ్య మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకుంటాడు. ఆయన వల్లే సినిమాలలోకి వచ్చానని గర్వంగా చెప్పుకోవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: