కమెడియన్ సుధాకర్ హీరోగా కెరీర్ మొదలు పెట్టి మంచి స్టార్ అవుతున్నా సమయంలో విలన్‌గా మారి చివరికి కమెడియన్‌గా ఎందరో ముఖాల్లో చిరునవ్వులు పూయించిన వ్యక్తి సుధాకర్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన అందరికీ సుపరిచితం అయిన నటుడు. 

 

అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న ఈ నటుడు మొదటి నుండి ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు.. పాపం తమిళనాట రజినీకాంత్, కమల్ హాసన్ కంటే ముందే సుధాకర్ సూపర్ స్టార్ అయ్యాడు. కానీ ఆయనను ప్లాన్ చేసి మరి కొందరు అక్కడ తొక్కేశారు.. ఆ తర్వాత టాలీవుడ్ కి వచ్చి కొన్ని సినిమాల్లో విలన్ గా చేసి ఆ తర్వాత పూర్తిస్థాయిలో కమెడియన్ గా మారిపోయారు. 

 

1990 సమయంలో అయన లేని సినిమా లేదు. పెద్ద పెద్ద హీరోలందరితో అయన నటించాడు.. ఏదైనా సినిమాలో సుధాకర్ లేడు అంటే అయ్యో ఇందులో సుధాకర్ లేడు అందుకే కామెడీ కూడా లేదు అని అనేవాళ్ళు. అప్పట్లో అంత పాపులారిటీ ఉండేది సుధాకర్ కి. అంత పాపులర్ కమెడియన్ అయినా 2000 సంవత్సరం వరుకు ఏడాదికి ఐదు ఆరు సినిమాలలో నటించే సుధాకర్ కు 2000 సంవత్సరం నుండి అవకాశాలు రావడమే తగ్గిపోయింది. 

 

అయన చివర నటించిన సినిమా సంక్రాంతి అంటే మీరు నమ్ముతారా? ఆ సినిమా తరవాత 12 ఏళ్లకు సుధాకర్ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఉపయోగం లేకపోయింది. అప్పటికే ఆయన్ను ప్రజలు మర్చిపోయారు. ఇంకా అలాంటి నటుడు ప్రస్తుతం దారుణమైన స్థితిలో ఉన్నారు అని నెల క్రితం వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి.  

 

 2010లో అనారోగ్యానికి గురైన సుధాకర్ ఆసుపత్రిలో చేరి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కోలుకున్నాడు కానీ ఆయనకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు.. చెప్పాలంటే ఆయన్ని అందరూ మర్చిపోయారు.. ఇంకా అతని ఫోటోలు కొన్ని ఈ మధ్యే బయటకు రావడం ఆ ఫొటోల్లో సుధాకర్ చాలా దారుణమైన స్థితిలో ఉండటం చూసి ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.. మనల్ని నవ్వించిన వ్యక్తి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు అని బాధ పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: