జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగులో అదిరింది షో ప్లాన్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు రావడం ఆయనతో పాటుగా అందులో ఉన్న ఇద్దరు స్టార్ కంటెస్టంట్స్ అదిరింది షోకి రావడంతో ఈ షో మీద ఆసక్తి పెరిగింది. అయితే ఛానెల్, టైటిలే తప్ప మిగిలినదంతా జబర్దస్తే అని ఒకటి రెండు ఎపిసోడ్స్ కే అర్ధమైంది. నాగబాబు, నవదీప్ జడ్జులుగా చేస్తున్న అదిరింది షోలో మొన్నటివరకు సమీరా హోస్ట్ గా చేసింది. అయితే ఏమైందో ఏమో సడెన్ గా లేటెస్ట్ ఎపిసోడ్ లో సమీరా బదులుగా హోస్ట్ స్థానంలో యాంకర్ రవి, భాను శ్రీలు వచ్చారు. 

 

ఏదో ఒక ఎపిసోడ్ కు వచ్చినట్టుగా కాకుండా సమీరా ప్లేస్ లో పర్మినెంట్ గా వీరే అన్నట్టుగా కబడుతుంది. ఇంతకీ సమీరా ఎందుకు షో నుండి బయటకు వెళ్లింది.. సమీరాని వీళ్లు కాదన్నారా ఆమే వెళ్లిందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. వీటికి సమీరానే సమాధానం ఇచ్చింది. అదిరింది షో నుండి ఆమె ఎగ్జిట్ అవడంపై కొన్ని వేల మెసేజులు, వందల కాల్స్ వస్తున్నాయట. అందుకే ఓ వీడియోతో ఆ ప్రశ్నలన్నిటికి సమాధానం ఇవ్వాలని అనుకుంది సమీరా. అదిరింది షో నుండి తను బయటకు రావడం నిజమే అని.. తనంతట తాను షో నుండి ఎగ్జిట్ అవలేదని.. ప్రొడక్షన్ వాళ్లు చెప్పబట్టే బయటకు వచ్చానని అన్నది సమీరా. 

 

తాను మానేయడం కాదు ఇదంతా గేమ్ లో భాగమే అని.. తనలా కాకుండా ఇంకా గ్లామర్ గా ఉండే వాళ్లు కావాలని అనుకున్నారేమో. అయినా షో నుండి తప్పించినా తనకు బాధగా లేదని. షో మంచి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మంచిదే కాబట్టి తను అదిరింది నుండి తప్పుకున్నా అని చెప్పింది. ఇక తనకు ప్రెగ్నెన్సీ కన్ ఫాం అయ్యిందని.. అందుకే షో చేయట్లేదని వస్తున్న వార్తలను ఖండించింది సమీరా. 26 ఎపిసోడ్స్ కు తనని తీసుకోగా 10 ఎపిసోడ్స్ కే తనని తీసేయడం ఆశ్చర్యకరంగా ఉందని అంటుంది సమీరా. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: