రంగ‌స్థ‌లం చిత్రం కోసం తీసి మాస్ గెట‌ప్‌ల‌లో డీగ్లామ‌ర్ పాత్ర‌ల్లో చ‌ర‌ణ్‌, స‌మంత‌ల‌ను ఎంతో చ‌క్క‌గా తీర్చిదిద్దాడు లెక్క‌ల‌మాస్ట‌ర్ సుకుమార్‌. ప్ర‌స్తుతం ఆయ‌న అల్లుఅర్జున్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించే ప‌నిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఆ చిత్రం ఓ మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర పైకి తీసుకువ‌స్తున్నాడు సుక్కు. ఈ చిత్రం ఇప్ప‌టికే అల్లు అర్జున్ కాంబినేష‌న్ లేకుండా ఒక షెడ్యూల్ పూర్తి చేసేసుకుంది.  ఇక‌ ఇదే నెల‌లో రెండో షెడ్యూల్ కేర‌ళ‌లో తీయ‌డానికి రెఢీ అయిపోతున్నారు చిత్ర యూనిట్‌.

 

శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగిన గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందించ‌బోతున్నాడు. అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా నెగెటివ్ ట‌చ్ వున్నఊర‌మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌రి ఈ చిత్రంలో హీరోయిన్‌గా క‌న్న‌డ సోయ‌గం రష్మిక మంద‌న్న‌ను సుకుమార్ ఇప్ప‌టికే మైండ్‌లో ఫిక్స్ అయిపోయార‌ట‌. అయితే తాజాగా త‌ను అనుకున్న పాత్ర కోసం రష్మికపై లుక్ టెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. గ్రామీణ యువ‌తిగా చిత్తూర్‌లోని అభ‌యార‌ణ్యంలో వుండే అమ్మాయిగా రష్మిక పాత్ర చిత్రీక‌ర‌ణ వుండ‌నుంద‌ని, దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ ఆయ‌న అనుకున్న రేంజ్‌లో రావ‌డంతో సుక్కు ఫుల్  ఆనందంగా వున్నాడ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.  మ‌రి ఈ సారి కూడా స‌మంత లానే ర‌ష్మిక‌ని కూడా ఓ డీగ్లామ‌ర్ పాత్ర‌లో సుకుమార్ చూపించ‌బోతున్నాడ‌ని అర్ధ‌మ‌యింది. మ‌రి ఇందుకు ర‌ష్మిక‌కి క్యారెక్ట‌ర్ అర్ధ‌మ‌వుతోందా.

 

ఇక స‌మంత రంగ‌స్థ‌లంలో డీగ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించిన‌ప్ప‌టికీ ఆమె అందం ఆమె న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టిప‌డేస్తుంది. స‌మంత న‌ట‌న‌కి అంద‌రూ ఫిదా అయిపోయారు. మ‌రి ఇప్పుడు ర‌ష్మిక కూడా ఆ రేంజ్‌ని అందుకోగ‌ల‌దా ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చూపించ‌గ‌ల‌దో లేదో వేచి చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కు ర‌ష్మిక చేసిన పాత్ర‌ల‌న్నీ దాదాపు క్లాస్ పాత్ర‌లు మాత్ర‌మే చేసింది. మ‌రి మాస్ క్యారెక్ట‌ర్‌లో ఆ లుక్‌లో ర‌ష్మికని ఈ లెక్క‌ల మాస్ట‌ర్ ఎలా తీర్చిదిద్దుతాడో తెర‌మీదే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: