శృంగార రసం, డాన్స్, అమ్మ, అత్త, విలన్, సహాయ నటి ఇలా వై విజయ చేయని పాత్ర అంటూ టాలీవుడ్ లో లేదు. అతి తక్కువ కాలంలోనే మంచి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ఆమె. డాన్సర్ అయినా సరే ఆమె తన నటనతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె తన రూపంలో ఉన్న గడుసరిని తన నటనలో కూడా చూపించే వారు విజయ. విలన్ భార్యగా, హీరోకి తల్లిగా, వ్యాపార వేత్తగా ఆమె నటన ఆకట్టుకుంది. విలన్ కి భార్యగా ఆమె ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. 

 

అబ్బాయి గారు సినిమాలో ఆమె ఆ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాలో ఆమె నటించిన ఒక పాత్ర, ఆ పాత్రలో ఆమె నటించిన తీరు, మాట్లాడిన మాటలు, ఆమె స్టైల్ అన్నీ ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. టాలీవుడ్ లో గడుసరి పాత్రలు అంటే ముందు సూర్యకాంతం తర్వాత ఈమె పేరే ఎక్కువగా వినపడుతూ ఉండేది. తమిళం, తెలుగు, కన్నడం ఇలా దాదాపు అన్ని భాషలలోను ఆమె నటించి మెప్పించారు. మా పల్లెలో గోపాలుడు సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిపోయారు. 

 

ఆ సినిమాలో ఆమె చేపల కూర వండుతుంది. దీనితో ఆమెకు నిక్ నేమ్ పులుసుగా ముద్రపడిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ కి అమ్మగా కూడా ఆమె నటించింది. విలన్ కి రెండో భార్యగా, విలన్ మొదటి భార్య కూతుర్ని వేధించే పాత్రలో ఆమె ఎక్కువగా ఆకట్టుకుంది. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం (1991), ఏప్రిల్ 1 విడుదల (1991), పెళ్ళాం చెబితే వినాలి (1992), మాతృదేవోభవ (1993), వద్దు బావా తప్పు (1993), అమ్మోరు (1995), గిల్లికజ్జాలు (1998), శుభాకాంక్షలు (1998), ఇద్దరు మిత్రులు (1999), రాజా (1999), విచిత్రం (1999), సర్దుకుపోదాం రండి, 2000), నువ్వు వస్తావని (2000) ఆమె పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: