స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ రెండు ఎంటర్టైన్ ఇచ్చేవే అయినా ఇక్కడ నుండి అక్కడకు వెళ్లాలన్న సరే చాలా టైం పడుతుంది. అందుకు లక్ ఫ్యాక్టర్ కూడా తోడవ్వాల్సి ఉంటుంది. కొందరు కేవలం స్మాల్ స్క్రీన్ కే పరిమితం కాగా.. మరికొందరు స్మాల్ స్క్రీన్ పై ఉన్న క్రేజ్ ను సిల్వర్ స్క్రీన్ కోసం ప్రమోట్ చేస్తుంటారు. స్మాల్ టూ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన వారిలో పాపులర్ ఆర్టిస్ట్ మామిళ్ల శైలజ ప్రియ ఒకరు. ఈమధ్య సినిమాల్లో బాగా కనిపిస్తున్న ఈమె ప్రియసఖి సీరియల్ ద్వారా పరిచయమైంది.  

 

అప్పట్లో సీరియల్స్ వారిని సినిమాల్లో అడపాదడపా తీసుకునే వారు.. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో ప్రియకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో ఆమె వెండితెర తెరంగేట్రం చేసింది. అయితే పూర్తిస్థాయిలో బుల్లితెర మీద దృష్టి పెట్టిన ప్రియ అక్కడ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అన్ని ఛానెల్స్ సీరియల్స్ లో నటిస్తూ అశేష ప్రేక్షకాదరణ సంపాదించారు ప్రియ. ప్రియ సఖి, ప్రియా నిను చూడలేక, ప్రియాప్రియా వంటి సీరియల్స్ తో టాప్ రేంజ్ కు వెళ్లింది.

 

బాగా తెలిసిన వ్యక్తిగా అనిపించే ప్రియా ఇప్పుడు సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటుంది. రీసెంట్ గా వచ్చిన వెంకీమామ సినిమాలో కూడా ప్రియ నటించడం విశేషం. సీరియల్స్, సినిమాలు చేయడమే కాదు టివి హోస్ట్ గా కూడా చాలా షోలు చేసింది. బుల్లితెర మీద ఆమె అభినయానికి ఎన్నో అవార్డులు కూడా అందుకుంది ప్రియ. ఇలానే ఆమె కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగిపోవాలని ఆశిద్దాం. అప్పట్లో హిరోయిన్ గా ట్రై చేయలేదు కాని ఆమె సీరియల్స్ కు పరిమితం అవడం వల్ల కొద్దిపాటి క్రేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.    

మరింత సమాచారం తెలుసుకోండి: