తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే నటి హేమ అంటే తెలియని వారు ఉండరు. అందులోనూ ముఖ్యంగా బ్రహ్మానందం, హేమా కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్లు నవ్వుల వర్షం కురిపిస్తాయి. విభిన్నమైన పాత్రలను చాలా తేలికగా చేసేయడం ఆమె ప్రత్యేకత అని కూడా చెబుతుంటారు. మ‌రియు కొన్ని వందల సినిమాలలో ఆమె నటించింది ఆమె నటన అంటే ఇష్టపడే వారు అభిమానులు చాలామందే ఉన్నారు. హేమ ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేసింది అంటే అది ఎప్పటికైనా గుర్తిండి పోతుంది అలా ఉంటుంది ఆమె నటన. చూడటానికి కాస్తంత బొద్దుగా, వయస్సు పై బడిన దానిలా ఉన్నా అందాలు మాత్రం ఏ మాత్రం చెక్కుచెదర లేదు. 

 

ఇక సినిమా అనే రంగుల ప్ర‌పంచంలో తానే క్వీన్‌గా మారాల‌ని చాలా మంది అమ్మాయిలు కెరీర్ తొలినాళ్ల‌లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కైనా ఒప్పుకుంటారు. అయితే రోజులు గ‌డుస్తున్న‌ కొద్దీ వారికి అవ‌కాశాలు త‌గ్గ‌పోవ‌డంతో ఒక‌ప్ప‌టి హీరోయిన్లే ఇప్పుడు కేరెక్ట‌ర్ ఆర్టిస్టులుగా మారుతున్నారు. అయితే హీరోయిన్‌గా చేసిన సినిమాల్లో కొన్ని రొమాంటిక్ సీన్ల‌కు సంబంధించిన వీడియోలు ఆధారంగా కొన్ని సైట్లు మితిమీరిపోతున్న సంగ‌తి తెలిసిందే. వారు అవ‌కాశాల కోసం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు, ముఖ్యంగా సెమీ పోర్న్ చిత్రాల‌కు న‌టించార‌ని కొన్ని వెబ్‌సైట్లు నిరాధార వార్త‌లు ప్ర‌చురిస్తుంటాయి. దీంతో స‌ద‌రు న‌టులు ఎంత‌గానో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఆ లిస్ట్‌లో హేమ కూడా ఉంది. 

 

వాస్త‌వానికి కెరెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్న హేమ.. కెరీర్ ఆరంభంలో కొన్ని త‌మిళ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. కానీ, ఈ విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. ఈ క్ర‌మంలోనే మంచి క‌థాబ‌లం ఉన్న సినిమాల్లో ఒకింత గ్లామ‌ర్ ఒలికించి పాత్రకు ప్రాణం పోసింది హేమ‌. అయితే ఆ సినిమాల్లోని కొన్ని వీడియోల‌ను ఆధారంగా తీసుకుని నైతిక విలువ‌ల‌కు స్వ‌త్తి చెప్పార‌ని.. త‌మ‌కు అనుగుణంగా కొన్ని వెబ్‌సైట్లు హేమపై అనేక ర‌కాలుగా పుకార్లు పుట్టించాయి. అప్ప‌ట్లో హేమ వీడియోలు బాగా వైర‌ల్‌గా మారియి. దీంతో మానసికంగా కృంగిపోయిన హేమ‌.. అప్ప‌ట్లో ఎంతో బాధ‌ను అనుభ‌వించింది. ఇక చివ‌ర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం.. ఆ వార్త‌ల‌పై హేమ ఫైట్ చేయ‌డంతో స‌ద‌రు వెబ్‌సైట్లు వెన‌క్కి త‌గ్గాయి. ఏదేమైనా అప్ప‌ట్లో హేమను ఆ వార్త‌లు బాగా వేధించాయి

.
  
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: