హీరోయిన్ 'వేదిక' కాంచన 3 సినిమాలో నటించి అందరి చేత వాహ్వా వాహ్వా అనిపించుకున్నది. వాస్తవానికి ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నటన, అందం, హావభావాలు అన్ని తెలుగు ప్రేక్షక అభిమాన ఎంతో అలరించాయి అని చెప్పుకోవచ్చు. నారా రోహిత్ సరసన బాణం సినిమాలో నటించి లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తో రూలర్ సినిమా లో జత కట్టి అద్భుతంగా నటించింది. 

 

IHG


సినిమా డిజాస్టర్ టాక్ ని అందుకున్నప్పటికీ... ఆమెకు మాత్రం నటనాపరంగా మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్ వేదిక గురించి ఇంకా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో తమన్నా తర్వాత ఈమెకు మాత్రమే మిల్కీ స్కిన్ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు తెల్లగా మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మకి మంచి అవకాశాలు రాక తన అందచందాలను వృధా అవుతున్నాయి.

 

IHG

 

మొదటిలో వేదిక మేకప్ అస్సలు లేకుండా కనిపించి తన న్యాచురల్ బ్యూటీ తో కుర్రకారుకి నిద్రపట్టకుండా చేసింది. 2008వ సంవత్సరంలో విజయదశమి చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈమె. ఆపై తెలుగు తమిళ కన్నడ భాషా భేదం లేకుండా అన్ని సినిమాలలో నటిస్తూ సౌత్ ఇండియా మొత్తంలో ప్రేక్షకులని తన అందంతో ఆకట్టుకుంటుంది. 

 

IHG

 

తన అందానికి తగిన మంచి సినీ ఆఫర్స్ రావాలనే ఉద్దేశంతో తను ఫోటో షూట్ లలో పాల్గొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఐతే ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఆమె చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ఫొటోస్ కింద వ్యాఖ్యలను చదివితే ఎంతమంది కుర్రకారు ఆమెపై మనసు పారేసుకున్నారో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: