మెగాస్టార్ చిరంజీవికొరటాల శివ కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహా రెడ్డి, అటు కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన భ‌ర‌త్ అనే నేను సినిమాల త‌ర్వాత వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కొర‌టాల ఏకంగా నాలుగు సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డంతో పాటు తొలిసారిగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేస్తుండ‌డంతో క‌థ ఎలా ఉంటుంది ?  హీరోయిన్ ఎవ‌రు ?  అన్న‌దానిపై అంద‌రిలోనూ క్యూరియాసిటీ నెల‌కొంది.



ఇక ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నట్లు నిన్నటి వరకు ప్రచారం జరిగింది. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ ఎవ‌రు ? అన్న‌ది కూడా తెలియ‌క‌పోవ‌డంతో ఇక టైటిల్ గా ఏం పెడ‌తార‌న్న దానిపై స‌స్పెన్స్ ఉండేది. అయితే తాజాగా బ్ర‌హ్మాజీ త‌న‌యుడు డెబ్యూ మూవీ ఫంక్ష‌న్‌లో చిరు అనుకోకుండా ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేశారు.  ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ నోరు జారీ సినిమా టైటిల్ ఆచార్య అని చెప్పేశారు.



వెంట‌నే అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. చిరు దానిని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసినా.. యాంక‌ర్ ప‌బ్లిక్‌గా అనౌన్స్ చేసేశారు. అయితే ఈ విష‌యంలో కాస్త అస‌హ‌నంతో ఉన్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఇప్పుడు టైటిల్ మార్చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. కొర‌టాల శివ త‌న సినిమాల విష‌యంలో ఏ మాత్రం లీక్ కాకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అయితే చిరు ఇలా టైటిల్ లీక్ చేయ‌డం ఆయ‌న‌కు ఎంత మాత్రం న‌చ్చ‌లేద‌ట‌. ఈ సినిమాకు మొదట్లో గోవింద ఆచార్య అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. మరి ఇప్పుడేం పెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: