పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాదని తెలిసినప్పటి నుండి ఆయన అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని చెప్పడంతో అభిమానుల్లో ఒకలాంటి నిరాశ ఆవహించిన మాట వాస్తవమే. పింక్ రీమేక్ లో నటిస్తున్నాడని తెలియడంలో ఆ నిరాశ పూర్తిగా ఆవిరైపోయి కొత్త చిగురు మొలకెత్తింది. పింక్ రీమేక్ ఒక్కటే కాదు ఇంకా వరుసగా మూడు సినిమాలు కన్ఫర్మ్ చేయడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

 

 

అయితే నిన్న పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ నుండి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సినిమాకి వకీల్ సాబ్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ పవన్ లుక్ ని వదిలారు. ఈ లుక్ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వెళ్ళింది. రెండు సంవత్సరాల తర్వాత పవన్ చేస్తున్న సినిమా కావడంతో ప్రతీ ఒక్కరిలో అమితమైన ఆసక్తి నెలకొంది. పవన్ అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుండి సినిమా పట్ల ఎన్నో అనుమానాలు మొదలవుతున్నాయి.

 

 

ఫస్ట్ లుక్ ని చూస్తుంటే ఇదేదీ హీరొ ఓరియంటెడ్ సినిమాలాగా కనిపిస్తుంది. నిజానికి పింక్ లో అంతగా హీరోయిజం ఉండదు. కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుంటుంది. లాయర్ పాత్ర కేవలం ఆ అమ్మాయిలకి సాయం చేసేలాగా మాత్రమే ఉంటుంది తప్ప ఏమాత్రం హీరోయిజం కనిపించదు. కానీ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ని చూస్తుంటే హీరోని ఎలివేట్ చేస్తున్నారా అనే అనుమానం కలుగక మానదు.

 

కానీ సినిమాలో అలాంటిదేమీ ఉండదని అంటున్నారు. హీరో ఎలివేట్ చేసే సన్నివేశాలు ఉన్నా కూడా అవి కూడా పాత్ర పరిధి మేరకే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాని ఎలాంటి మర్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే తీయాలని ముందే డిసైడ్ అవడంతో అలాంటి అనుమానాలేమీ పెట్టుకోవద్దని సమాధానం ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: