‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘శతమానం భవతి’ సినిమాలు రెండు వరసగా రెండు సంవత్సరాలు సంక్రాంతి పండుగ రేసులో విడుదలై హిట్ కొట్టడంతో శర్వానంద్ ను సంక్రాంతి హీరో అంటూ ఇండస్ట్రీ వర్గాలు మీడియా ఒకేసారి ఆకాశానికి ఎత్తేసాయి. దీనితో శర్వానంద్ కు వరస పెట్టి అవకాశాలు కూడ బాగా వచ్చాయి. 


అయితే ‘శతమానం భవతి’ తరువాత ఇతడు నటించిన అన్ని సినిమాలు వరసగా ఫెయిల్ కావడంతో హ్యాట్రిక్ ఫెయిల్యూర్ హీరోగా మారిపోవడమే కాకుండా శర్వానంద్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే చాలా మంది హీరోల మాదిరిగా ఇతడికి హిందీ డబ్బింగ్ మార్కెట్ లేదు. ఇతడి సినిమాలు హిందీలోకి డబ్ చేసినా ఎవరు చూడరు. 


అయితే రవితేజ గోపీచంద్ లాంటి హీరోలు ప్రస్తుతం ఫెయిల్యూర్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నా వాళ్ళ సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా నిర్మాతలకు బాగా డబ్బు వస్తోంది. కనీసం అలాంటి మార్కెట్ కూడ శర్వానంద్ సినిమాలకు లేదు. దీనితో శర్వానంద్ కి థియేటర్స్ బిజినెస్ తప్ప బయట నుంచి వచ్చే అదనపు ఆదాయం అతడి సినిమా నిర్మాతలకు ఉండటం లేదు. 


ఈ పరిస్థితుల నేపధ్యంలో శర్వా నటించిన లేటెస్ట్ మూవీ ‘జాను’ ఫ్లాప్ కావడమే కాకుండా కనీసం ఈ సినిమాకు చెప్పుకోతగ్గ ఓపెనింగ్స్ కూడ రాకపోవడంతో ప్రస్తుతం ఈ హీరో పేరు చెపితే ఇండస్ట్రీలోని మిడిల్ రేంజ్ నిర్మాతలు కూడ భయపడి పోతున్నట్లు టాక్. ‘జాను’ విడుదలకి ముందు శర్వానంద్ తో సినిమాలు ప్లాన్ చేసిన నిర్మాతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇతడితో సినిమా తీసి రిస్క్ చేయడం కంటే ఫామ్ లో ఉన్న వేరే హీరోలతో చేస్తే బిజినెస్ గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తున్న పరిస్థితులలో ప్రస్తుతం ఈ యంగ్ హీరో డేట్స్ అడుగుతున్న నిర్మాతలు కూడ లేరు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శర్వా నటిస్తున్న ‘శ్రీకారం’ కూడ హిట్ అవ్వకపోతే ఈ హీరో పరిస్థితి అయోమయంలో పడిపోయినట్లే. దీనితో ఫెయిల్యూర్ లో రవితేజా కు ఉన్న అదృష్టం కూడ శర్వానంద్ కు లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..     

మరింత సమాచారం తెలుసుకోండి: