హేమ మంచి పాత్రల్ని చేసింది. అనేక సినిమాలో వివిధ పాత్రలతో ప్రేక్షకులని మెప్పించింది. 250 కి పైగా నటించింది హేమ. అయితే హేమ తన అసలు పేరు కాదు. ఆమె అసలు పేరు కృష్ణవేణి. ఈమె తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించింది. 1989 నుండి సినిమాలలో నటిస్తోంది. చాలా చలాకీగా ఉంటూ మంచి పాత్రలని పోషిస్తుంది హేమ.

 

IHG

 

మంచి భార్య పాత్రల్లో ఈమె నటిస్తూ నవ్విస్తుంది. ఇన్ని సినిమాలలో నటించడం మాటలు కాదు. ఎంతో ఆసక్తి ఉంటే కానీ ఇది జరగని పని. కేవలం సినిమాలలో మాత్రమే కాకా ఈమె మండపేటలో జరిగిన 2014 ఎన్నికలో ఈమె పాల్గొన్నది. కానీ విజయం ఆమెకి దక్కలేదు. ఓటమి అందుకుంది ఆ ఎన్నికల్లో. కానీ సినిమాలో మాత్రం మంచి ఆంటీ పాత్రల్ని చేసి గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది నటి హేమ.

 

IHG

 

చిన్ననాటి నుండి కూడా ఆమెకి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంది అని ఎన్నో సార్లు చెప్పారు. ఈమె బాల్యం నుండి సినిమాలో కొన్ని పాత్రలు చేసింది. అయితే పెళ్ళి తర్వాత గ్యాప్ ఇచ్చింది కొంత కాలం. కాకపొతే మళ్ళీ మురారి సినిమాతో మరోసారి ఎంట్రీ ఇచ్చింది. 1989 లో చిన్నారి స్నేహంతో తెరపై కనిపించింది

 

 

ఆ తర్వాత స్వాతి చినుకులు, ముద్దుల మావయ్య, బాల గోపాలుడు, ధర్మ యుద్ధం, హలో డార్లింగ్ లేచి పోదామా, రౌడీ ఇన్స్పెక్టర్, పరుగో పరుగు, నువ్వు నాకు నచ్చావ్, మురారి, సొంతం, నీ స్నేహం, నా అల్లుడు ఇలా అనేక సినిమాలలో నటించింది హేమ. బాల్యంలో హేమకి సినిమాలపై ఉన్న ఆసక్తే ఇలా ఇన్ని వందల సినిమాలలో నటించడానికి కారణం. ఆ ఆసక్తి ఆమెని నటి చేసింది . ఇలా కృష్ణవేణి హేమగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: