నిర్మలమ్మ... ఈ తరానికి పేరు తెలియకపోవచ్చు ఏమో గాని కిందటి తరానికి మాత్రం ఈ పేరు బాగా పరిచయం. ఆమె చేసిన సినిమాలు, ఆమె చేసిన పాత్రలు, అగ్ర హీరోలతో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్స్. టాలీవుడ్ లో చాలా మందికి నిర్మలమ్మ గురువు అంటారు. ఎలాంటి సన్నివేశం అయినా ఏ విధంగా నటించే విధానం అయినా సరే ఆమె తన హావభావాలలో తన మాటలో చూపించేస్తారు. హీరోలకు అమ్మమ్మ గా ఆమె చేసిన పాత్రలు అన్నీ ఇన్ని కావు అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఆమె అలా ఒక వెలుగు వెలిగారు. 

 

చినరాయుడు సినిమాలో ఆమె వెంకటేష్ కి అమ్మగా నటించారు. ఆ సినిమాలో ఆమె కామెడి చేయడంతో పాటుగా... విజయశాంతిని ఆమె పిలిచిన పిలుపులు అన్నీ కూడా ఇప్పటికి వినపడుతూనే ఉంటాయి. దేవత సినిమాలో మోహన్ బాబు కి ఆమె బామ్మగా నటించారు. నటనలో ఆమె హుందాతనం చూపించారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవికి ఆమె బామ్మ గా నటించారు. టాలీవుడ్ మొత్తం ఆమె నటిస్తుంటే అలా చూస్తుండిపోయేది. 

 

ఆమె చేసిన పాత్రలు చాలా మంది నటులు చేయలేదు. ఆమె చేసిన సినిమాలు కూడా ఎవరూ చేయలేకపోయారు అనేది వాస్తవం. ఎలాంటి సన్నివేశం అయినా నిర్మలమ్మ ఉంటే చాలు ఆ సీన్ పండుతుంది అని దర్శకులు భావించే వారు. అగ్ర హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, బాలకృష్ణ ఎలా అందరి పక్కన ఆమె నటించారు. వారి సినిమాల్లో ప్రధాన ఆస్తి ఆమె. ఆమె ఉంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూసే వాళ్ళు. ఆమె మాటలు మన ఇంట్లో అమ్మమ్మ మాటలు మాదిరిగా ఉంటాయని అనే వాళ్ళు అభిమానులు. అలా చెరగని ముద్ర వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: