క‌న్నాంబ ప్ర‌సిద్ధ రంగ‌స్థ‌ల న‌టి గాయ‌ని. చ‌ల‌న చిత్ర రంగంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ఈమె జ‌న్మించింది. 13 సంవ‌త్స‌రాల‌లోనే ఈమె బాల‌న‌టి పాత్ర‌లు వేస్తూ వ‌చ్చారు. తొలిసారిగా నాట‌క‌రంగ ప్ర‌వేశం చేసింది. త‌న నాట‌క‌రంగ ప్ర‌వేశంతో హ‌రిశ్చంద్ర తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో అడుగుపెట్టాంది. ఆత‌ర్వాత ద్రౌప‌ది వ‌స్త్రాభ‌ర‌ణంలో ద్రౌప‌దిగా అద్భుతంగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు, ప్ర‌శంస‌లను అందుకుంది. పాదుకా చంద్రిక‌, క‌న‌క‌ధార‌, ప‌ల్నాటి యుద్ధం, గృహ‌ల‌క్ష్మీ, అనార్క‌లి, ద‌క్ష‌య‌జ్ఞం, తోడికోడ‌ళ్ళు, కృష్ణ‌కుచేలా, త‌దిత‌ర చిత్రాలు ఆమె న‌టించిన ముఖ్య‌మైన‌వి. 

 

ఎం.జి.రాంచంద్ర‌న్‌, ఎస్‌.ఎస్‌.రాజేంద్ర‌న్‌, శివాజీగ‌ణేష‌న్‌, నాగ‌య్య‌, పి.యు.చిన్న‌ప్ప‌, ఎన్టీఆర్ వంటి అగ్ర‌క‌థానాయ‌కులతో న‌టించారు క‌న్నాంబ‌. సుమారు 150కి పైగా పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క సినిమాల్లో త‌న‌దైన శైలిలో అద్వితీయంగా న‌టించి గొప్ప న‌టీమ‌ణిగా కీర్తి గ‌ణించింది. న‌వ‌ర‌సాలు అద్భుతంగా న‌టించి మెప్పించింది. క‌న్నాంబ భ‌ర్త క‌ళారు నాగ‌భూష‌ణం, ఇద్ద‌రూ క‌లిసి రాజ‌రాజేశ్వ‌రి నిర్మాణ సంస్థ‌ను స్థాపించి అనేక చిత్రాల్లో అన్ని భాష‌ల్లోనూ నిర్మించారు. క‌న్నాంబ పాడిన‌టువంటి కృష్ణం అనే గ్రామ‌ఫోన్ గీతాలు ఆనాటి రోజుల్లో ప్ర‌తి ఇంట మారుమోగుతుండేవి. ఆమె గొప్ప న‌టీమ‌ణి మాత్ర‌మే కాదు చ‌క్క‌ని గాయ‌ని కూడా. సుమారు ఐదు ద‌శాబ్ధాలు త‌న‌దైన ప్ర‌త్యేక శైలిలో న‌టించింది. 

 

న‌టిగా ఆమె న‌టించిన కొన్ని చిత్రాలు ఇప్ప‌టికీ మ‌న క‌ళ్ళ ముందు మెద‌లాడుతూనే ఉంటాయి. ఒక వ‌దిన పాత్ర అయినా ఒక త‌ల్లి పాత్ర అయినా స‌రే అప్ప‌ట్లో క‌న్నాంబ పెట్టింది పేరు అనే చెప్పాలి. ఆమె డైలాగ్ మాడ్యులేష‌న్‌కి గొప్ప గొప్ప న‌టులైనా ఫిదా అయిపోతుంటారు. అలా ఎవ‌రైనా స‌రే అల‌నాటి మేటి న‌టి క‌న్నాంబ త‌ర్వాత ఎవ్వ‌రూ లేర‌నే అంటారు. ఎందుకంటే మాంగ‌ల్య గౌర‌వం కావొచ్చు, కుటుంబ గౌర‌వం కావొచ్చు ఇక ఎన్నో సినిమాలు తోడికోడ‌లు సినిమాలో అయితే ఆమె న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యార‌ట‌. శ్రీ‌కృష్ణ‌తులాభారం, మ‌నోహ‌ర‌, సుధామ‌ణి, ఆమె న‌ట‌న తెలుగు చల‌న చిత్ర సీమ‌లో ఒక మ‌కుటం లేని మ‌హారాణిలా వెలుగొందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: