అల్లు అర్జున్ తెలుగులో మంచి మార్కెట్ ఉన్నది.  అటు కేరళలో కూడా బన్నీకి తిరుగులేదు.  అందులో సందేహం అవసరం లేదు.  అయితే, బన్నీ అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.  ఇది వేరే విషయం అనుకోండి.  అయితే, ఒకప్పుడు బన్నీ సినిమా వరుడు గుర్తుంది కదా గుణశేఖర్ దర్శకుడు.  ఆ సినిమా కోసం బన్నీ ఎంతగా కష్టపడ్డాడో చెప్పక్కర్లేదు.  ఆ సినిమా సమయంలోనే బన్నీ చేతికి దెబ్బ తగిలింది.  


కానీ ఎట్టి పరిస్థితిల్లో కూడా బన్నీ సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకోలేదు.  ఇక సినిమా హీరోయిన్ విషయంలో గుణశేఖర్ ఎంతగా దాచిపెట్టాడో చెప్పక్కర్లేదు.  ఎందుకు దాచిపెట్టాడో తెలియదుగాని సినిమా విషయంలో అప్పట్లో చాలా క్యూరియాసిటీ వచ్చింది.  కానీ, సినిమా మాత్రం ఫెయిల్ అయ్యింది.  అందులో బన్నీకి యాంటీగా నటించిన తమిళ్ హీరో ఆర్య.  ఆర్య ఆ సినిమాలో సూపర్ గా నటించారు.  


సూపర్ గా మెప్పించాడు.  సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.  అదంతా ఇప్పుడు అనవసరం అనుకోండి.  విషయం ఏమిటంటే, ఈ సినిమాలో విలన్ గా చేసిన ఆర్య ఇప్పుడు తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు.  బాక్సర్ గా చేస్తున్న ఆ సినిమాలో ఆయన్ను చూసి అందరూ షాక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.  బాక్సర్ పాత్ర కోసం ఆర్య బాగా కష్టపడుతున్నాడు.  


శరీరాన్ని అమాంతం పెంచేశాడు.  నిత్యం జిమ్ లో ఉంటూ కష్టపడుతున్నారు.  ఆర్యను చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారట.  ఇక అయన భార్య అయితే చెప్పాల్సిన అవసరం లేదు.  తన భర్త అలా అయిపోయాడేంటి అని భయపెడుతున్నది.  ఆనందంతో కన్నీరు కారుస్తోంది.  షాకింగ్ లో ఉన్నది అయేషా.  ఎప్పుడు స్లిమ్ గా ఉండే  ఆర్య ఇలా కండలు పెంచి చూడటానికి చాలా స్ట్రాంగ్ గా నిజమైన బాక్సర్  లా మారిపోయాడట.  ప్రియదర్శిని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: