అంటూ హాస్య నటుడు బ్రహ్మానందం ఆమెని ఆగమంటాడు. ఇలా ఇటువంటి కొన్ని సీన్స్తో , డైలాగ్స్ తో కరాటే కళ్యాణి ఆంటీ క్యారక్టర్లో కళ్యాణి ఎంతో హాస్యాన్ని పండిస్తోంది. కృష్ణ సినిమాలో కళ్యాణి బాబీ... అంటూ రొమాన్స్ చేస్తుంది. నువ్వు ఉండవే... ఎంతో ఫేమస్ అయిపొయింది. అబ్బా.. అంటూ ఒక్క ఊపు తెప్పిస్తుంది ఈ ఆంటీ.

 

IHG

 

అలానే గొప్ప హాస్యంతో గోల పెట్టిస్తుంది కళ్యాణి. ఈమె అసలు పేరు కళ్యాణి పడాల. విజయనగరం ఈమె జన్మస్థలం, వివిధ పాత్రలతో ఎంతో మంది ప్రేక్షకులని మెప్పించింది. అంత సింపుల్ రోల్స్తో చిన్న పాత్రలు చేసే కళ్యాణికి గొప్ప  ఉంది. గుక్క మింగకుండా 114 గంటల 45 నిమిషాలు 55 సెకండ్స్ పాటు హరికధని ఆలపించి ఓ రికార్డుని కైవసం చేసుకుంది కరాటే కళ్యాణి.

 

లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్తో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది ఈ నటి. నిజంగా గొప్ప ట్యాలెంట్ గల నటి మన కరాటే కళ్యాణి. 2000 సంవత్సరం నుండి ఈమె సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. వివిధ పాత్రలతో ఈ ఆంటీ మంచి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి అందిస్తుంది. గుంటూరు టాకీస్, రాజా ది గ్రేట్, గౌతమ్ నంద, ఎవడే సుబ్రహ్మణ్యం, మా అల్లుడు వెరీ గుడ్, ఛత్రపతి, కృష్ణ, మిరపకాయ్ సినిమాలలో మంచి పాత్రలని అందించింది.

 

IHG

 

చిన్న పాత్రల్ని చేసిన ఆమె ట్యాలెంట్ ఎంతో గొప్పది. అలానే అంటీగా జోష్ తెప్పిస్తున్నాఈ యాక్టర్ రికార్డ్ సాటిరానిది. ఈమె మధుమాసం, ముత్యాలముగ్గు, గోరంత దీపం వంటి సీరియల్స్ లో కూడా నటించింది. అలానే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది ఆంటీ. అందుకే కరాటే కళ్యాణి అని పిలుస్తారు ప్రేక్షకులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: