తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు డిఫరెంట్ మేకింగ్ స్టైల్ మెయింటెన్ చేస్తోంది. టాలీవుడ్ లో ఒక వైపు భారీ బడ్జెట్ తో, భారీ స్టార్ కాస్ట్ తో స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరోవైపు అంత పెద్ద బడ్జెట్ లేకుండా , పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ని హైలెట్ చెయ్యకుండా ఓన్లీ కంటెంట్  మీదే కాన్సన్ ట్రేట్ చేసి క్రేజీగా తెరకెక్కుతున్న సినిమాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 

ప్రస్తుతం ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్న క్రేజీ సినిమా వి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచే ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఇందులో నిజంగా క్రేజీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకూ నాని తన కెరీర్ లో చెయ్యని నెగెటివ్ రోల్ చేస్తున్నాడు ఈ సినిమాలో. సుధీర్ బాబు పోలీస్ రోల్ లో రక్షకుడిగా కనిపిస్తుంటే ..నాని  విలన్ గా రాక్షసుడిగా తెరమీద కనిపించబోతున్నాడు. ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ అవుతోంది.

 

రానా హీరోగా వస్తున్న అరణ్య సినిమా కూడా క్రేజీ ప్రాజెక్ట్ గానే తెరకెక్కుతోంది. రెండున్నర సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కంప్లీట్ వైల్డ్ లైఫ్ లో తెరకెక్కుతోంది. 30 ఏనుగులు, 6 అడవులు.. లిమిటెడ్ స్టార్ కాస్ట్ తో ప్రభు సాల్మన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సోషల్ ఇంట్రస్ట్   మూవీ.. ఏప్రిల్ 2 న రిలీజ్ అవుతోంది.

 

ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన రామ్ .. మరో ఇంట్రస్టింగ్ సినిమాతో వస్తున్నాడు. తమిళ్ లో హిట్ అయిన తడమ్ రీమేక్ గా వస్తున్న రెడ్  సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు  రామ్. ఈ సినిమా ఏప్రిల్ 9 రిలీజ్ కాబోతోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా టైటిల్ తోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన సినిమా సోలో బ్రతుకే సో బెటరూ. రిలీజ్ చేసిన పోస్టర్ తోనే ఆడియన్స్ ఎటెన్షన్ గ్రాబ్ చేసిన ఈ సినిమా మే ఫస్ట్ మేడే రోజు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలతో సక్సెస్ సాధించి ఫామ్ లోకి రావడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మన స్టార్లు .

మరింత సమాచారం తెలుసుకోండి: