టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రెండేళ్ల క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన కమర్షియల్ సినిమా డీజే. దువ్వాడ జగన్నాథంగా బన్నీ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో ఆయన సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా మురళి శర్మ, రావు రమేష్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా మొత్తంగా యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ, దీనికి దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ కు మాత్రం మంచి స్పందన లభించింది. ఇక ముఖ్యంగా గుడిలో బడిలో, సీటీమార్, బాక్స్ బద్దలైపోయే సాంగ్స్ అయితే శ్రోతల నుండి ఎంతో మంచి స్పందనను అందుకోవడం జరిగింది. 

 

ఇకపోతే నేడు ఈ సినిమాలోని సీటీ మార్ వీడియో సాంగ్ కు యూట్యూబ్ లో 150 మిలియన్ల వ్యూస్ తో పాటు 484కె లైక్స్ దక్కాయి. దీనితో సౌత్ ఇండియాలో అత్యధిక వ్యూస్ అందుకున్న సాంగ్స్ జాబితాలో ఈ సీటీ మార్ సాంగ్ కూడా చేరిపోయింది. అయితే ఇది మాత్రమే కాదు ఇటీవల బన్నీ, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలోని సాంగ్స్ కూడా ఎంతటి గొప్ప విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వాటిలో సామజవరగమనా, రాములో రాముల సాంగ్స్ అయితే ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో అలానే 1 మిలియన్ పైగా లైక్స్ తో అద్బుతమైన స్పందనను రాబట్టడం జరిగింది. 

 

ఇక కొన్నేళ్ల నుండి బన్నీ సినిమాలతో పాటు సాంగ్స్ కూడా ఈ విధంగా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుండడంతో అటు తన ఫ్యాన్స్ తో పాటు బన్నీ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు ఈ విధంగా తనపై కురిపిస్తున్న అభిమానానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని, ఇక పై తన నుండి వచ్చే సినిమాలు అన్నీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయని బన్నీ ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: