టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. పవన్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, అనన్య లతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని నిన్న రిలీజ్ చేసింది సినిమా యూనిట్. పవన్ స్టైలిష్ లుక్ లో పడుకుని ఉన్న ఆ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 

 

ఇక ఆ పోస్టర్ కు అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు పలువురు సినిమా ప్రముఖుల నుండి కూడా మంచి అభినందనలు అందుతున్నాయి. దాదాపుగా రెండేళ్లకు పైగా విరామం తరువాత పవర్ స్టార్ నటిస్తున్న సినిమా కావడంతో, తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందని కొందరు సినిమా ప్రముఖులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వకీల్ సాబ్ టీమ్ కు అభినందనలు తెలియచేస్తున్నారు. కాగా మంచు వారబ్బాయి మనోజ్, నిన్న ఈ పోస్టర్ పై తన స్పందనను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. 

 

'సంవత్సరంలో ఉన్న పండగలన్నీ ఫ్యాన్స్ ఒక్క రోజులోనే జరుపుకునేలా ఉందిగా పోస్టర్. త్వరలోనే తెరమీద కనపడనున్న జనసేనాని పవన్ కళ్యాణ్  గారికి, అలానే వకీల్ సాబ్ సినిమా టీమ్ కి నా బెస్ట్ విషెస్ అంటూ మనోజ్ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేసారు. ఇకపోతే మనోజ్ చేసిన ఈ ట్వీట్ పై పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇటీవల ప్రారంభం అయిన మనోజ్ బ్యానర్ డెబ్యూ వెంచర్ మూవీ తప్పకుండా సక్సెస్ కావాలని కోరుకుంటూ అతడికి అబినందనలు తెలియచేస్తున్నారు. కాగా మనోజ్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: