హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లకు, సితార బ్యానర్లకు వరుసగా మంచి సినిమాలు వస్తుండడంతో కాస్త ఓవన్ కాన్ఫిడెన్స్‌లోకి వెళుతున్నారా ? అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు బ్యానర్లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. కాస్త డబ్బులు వెనకేసుకుంటున్నాయి. అక్కడి వరకు ఓకే తాజాగా నానితో వీళ్లు 'శ్యామ్ సింగ రాయ్' ప్రాజెక్టు చేస్తున్నారు. ప్రాజెక్టు అలా ఎనౌన్స్ అయ్యిందో లేదో వెంటనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ప్రస్తుతం నాని చేసే టక్ జగదీష్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.
ఇక ఈ కొత్త ప్రాజెక్టు అయిన శ్యామ్ సింగ రాయ్‌కు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. రాహుల్ చాలా టైం టేకింగ్‌తో సినిమాలు చెక్కుతారన్న టాక్ ఉంది. గతంలో యూవీ, గీతా లాంటి రెండు పెద్ద బ్యానర్లు కలిసి చేస్తేనే టాక్సీవాలా సినిమా రిలీజ్ అయ్యేందుకు ఏకంగా రెండేళ్లు పట్టింది. అసలు ఆ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందో? కూడా ఎవ్వరికి అర్థం కాలేదు. ఆ టైంలో దర్శకుడు మారుతి సైతం రంగంలోకి దిగి మళ్లీ చెక్కుళ్లు చెక్కి చాలా వరకు ట్రిమ్ చేస్తే కాని ఓ పట్టాన తెమలలేదు.
రాహుల్ సినిమా తీయడం అంటే చాలా స్లో అని కనీసం యేడాదికి పైగా పడుతుందన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది ఇప్పుడు చకచకా సినిమాలు చేసే నానితో రెండు పెద్ద బ్యానర్లు రాహుల్ డైరెక్షన్లో సినిమా ఎనౌన్స్మెంట్తో పాటు రిలీజ్ డేట్ కూడా ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. పైగా రెహ్మన్ మ్యూజిక్ అంటున్నారు. రెహ్మన్ మ్యూజిక్ కూడా యేడాది టైం తీసుకుంటాడు.
ఇక కథ మరో డైరెక్టర్‌ది అట. అంతెందుకు జెర్సీ తర్వాత నానిపై పెద్ద బడ్జెట్ పెట్టేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ఇవన్నీ తెలిసి కూడా సితార సంస్థ రాంగ్ స్టెప్ వేస్తుందన్న సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. నాని సైతం ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సినిమాకు ఎందుకు వెళుతున్నాడో ? అర్థం కావట్లేదట.