ఇటీవల తన లవ్‌ లైఫ్‌కు సంబంధించిన సీక్రెట్స్‌ బయట పెట్టి వార్తల్లో నిలిచిన అందాల భామ సనా ఖాన్‌. తన ప్రియుడు తనను మోసం చేశాడంటూ బహిరంగంగా చెప్పిన సనా, అతనిపై పెద్ద పెద్ద ఆరోపణలే చేసింది... `నేను మెల్విన్తో విడిపోయిన మాట నిజమే. నేను అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ అతను మరో అమ్మాయితో సన్నిహితంగా ఉంటూ నన్ను మోసం చేసాడు. నేను నమ్మకంగా ప్రేమిస్తే అతను నన్ను మోసం చేశాడు.

 

ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా. కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అతను ఎవరితో ప్రేమలో ఉన్నాడో కూడా నాకు తెలుసు. కానీ నేను ఆ అమ్మాయి పేరు చెబితే బాగోదు. నేను మెల్విన్‌తో ప్రేమలో ఉన్నానని తెలిసి చాలా మంది అతను ఎలాంటి వాడో చెప్పారు. నేను నమ్మలేదు` కానీ తరువాత కొన్ని పరిణామాల కారణంగా నమ్మాల్సి వచ్చింది` అంటూ తన బాధను వివరించింది.

 

అయితే ఈ విషయం జరిగి ఎక్కువ రోజులు కాకముందే తిరిగి తన రెగ్యులర్‌ లైఫ్‌లో బిజీ అయిపోయింది సనా ఖాన్. వరుసగా పేజ్‌ 3 పార్టీలు ఫంక్షన్లలో సందడి చేస్తూ కనిపిస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో ఆకట్టుకుంటోంది. స్నేహితుల బర్త్‌డే పార్టీలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే 2005లోనే కెరీర్‌ ప్రారంభించిన సనా ఖాన్ తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్‌ నూకయ్య లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో టామ్‌ డిక్‌ అండ్ హ్యారీ 2 సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Look at you girl 🤩 Ufff 😍😝

A post shared by sana Khaan (@sanakhaan21) on

మరింత సమాచారం తెలుసుకోండి: