సునీల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతను పేరు తెలియని వారు ఎవ్వరు ఉండరు. కామెడీ అంటే సునీల్ ,సునీల్ అంటే కామెడీ అనే విధ౦గా తన నటన తో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపాడు. దశబ్దం కాలం పాటు సునీల్ తన కామెడీతో ప్రేక్షకులను కడుపు ఉబ్బా నవ్వించాడు. సినిమా ఎలా ఉన్న  సునీల్ కామెడీ కోసం కాసేపు హాయిగా నవ్వుకోడానికి వెళ్లేవారు. ఆ విధముగా కుటుంబ ప్రేక్షకులను సునీల్ ఆకట్టుకున్నాడు. తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. గోదావరి జిల్లాలు నుంచి వచ్చిన సునీల్ డైరెక్టర్ త్రివిక్రమ్ మంచి స్నేహితులు. 

 

వీరిద్దరూ సినీప్రస్థానం మొదలు పెట్టక ముందు ఇద్దరు హైదరాబాద్ లో ఒక రూమ్ లో కలిసి ఉండేవారు. ఇలా కలిసి ఉండి అవకాశాలు వేట చేసేవారు. వీళ్ళ  కృషి ఏ వాళ్ళని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళింది. సునీల్ టాప్ కమెడియన్ గా స్థిరపడ్డాడు, త్రివిక్రమ్ తన మాటలు, రాతలతో గొప్ప  డైరెక్టర్ అయ్యారు. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో సునీల్ కామెడీ ఉండాల్సిందే నువ్వునాకునచ్చావ్ ,సొంతం ,నువ్వు నేను ,నువ్వే నువ్వే ,నువ్వు లేక నేను లేను సినిమాల్లో సునీల్ చేసిన కామెడీ ఎప్పటికి మరచిపోలేము అంత బాగా చేసేవాడు.  

 

సునీల్ కామెడీ పాత్రల్లో రాజుగా నిలిచిన  సమయం లో అతను అది వదులుకొని హీరో గా అందాలరాముడు సినిమా ద్వారా హీరోగా పరిచమయ్యాడు.ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది, తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో  మర్యాదరామన్న అనే సినిమా చేసాడు. ఈ సినిమా బాక్సఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సినిమా హిట్ క్రెడిట్ అంత రాజమౌళికి ఏ దక్కింది. ఆ తర్వాత నుంచి సునీల్ సినీ కష్టాలు ప్రారంభమయ్యాయి. తీసిన ప్రతి సినిమా ఎప్పుడు వస్తుందో ,ఎప్పుడు వెళ్తుందో తెలియలేదు. 

 

ప్రేక్షకులు కూడా సునీల్ సినిమాలు అంటే పక్కన పెట్టేసారు. కమెడియన్ గా చేస్తున్నపుడు టాప్ ప్లేసులో ఉండి హీరోగా ట్రై  చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు తన తప్పులు తెల్సుకొని మల్లి కామెడీ ట్రాక్ ఎక్కాడు. సక్సెస్ ని చూస్తున్నాడు. హీరోగా మళ్ళి ట్రై చేయకూడదు అని గట్టిగ అనుకుంటున్నాడు అని టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు అంట.

మరింత సమాచారం తెలుసుకోండి: