టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో నితిన్‌కు చాలా రోజుల త‌ర్వాత భీష్మ రూపంలో మంచి హిట్ వ‌చ్చింది. మ‌హా శివ‌రాత్రి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భీష్మ సినిమా తొలి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతోంది. నితిన్ - రష్మిక మందన జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ ఈ సీజన్ క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నితిన్‌కు 2015లో వ‌చ్చిన అ..ఆ సినిమా త‌ర్వాత ఇదే పెద్ద హిట్‌. మ‌ధ్య‌లో మూడు వ‌రుస ప్లాపులు వ‌చ్చినా.. నితిన్ మార్కెట్ ప‌డిపోయినా ఈ సినిమాతో నితిన్ మ‌ళ్లీ పుంజుకున్నాడు.



ఇక భీష్మ 10 డేస్ కలెక్షన్స్ పరిశీలిస్తే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 26. 28 కోట్లు క‌లెక్ట్ అయ్యింది. ఈ సినిమాకు రు. 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 26.28 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా కొన్న వారు భారీ లాభాల్లోకి వ‌చ్చేశారు. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సోలో రిలీజ్‌తో వ‌చ్చి చాలా త‌క్కువ ప్రి రిలీజ్ బిజినెస్ చేసి 10 రోజులు అవుతున్నా పెద్ద‌గా వ‌సూళ్లు రాబ‌ట్ట లేక‌పోయింది. వాస్త‌వంగా చూస్తే ఈ సోలో రిలీజ్‌కు ... వ‌చ్చిన టాక్‌కు ఇవి త‌క్కువ వ‌సూళ్లే అనాలి.



ప్ర‌తి ఒక్క‌రు కూడా భీష్మ సినిమాను  నితిన్ కెరీర్ లో సంతృప్తికరమైన బ్లాక్ బస్టర్ ఇది. కెరీర్ బెస్ట్ హిట్ గా డిక్లేర్ చేశారు. అలాగే వెంకీ కుడుముల కెరీర్ కి ఈ హిట్ పెద్ద ప్లస్ కానుంది. అన్ని బాగానే ఉన్నా ఈ సినిమా వ‌సూళ్లు మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేద‌నే చెప్పాలి. వ‌చ్చిన టాక్‌తో పోలిస్తే ఇప్ప‌టికే ఈ సినిమా రు.35 కోట్ల పై చిలుకు షేర్ రాబ‌ట్టాల్సి ఉంది. అయితే ఇప్ప‌ట‌కీ వ‌ర‌ల్డ్ వైడ్గా తీసుకున్నా కేవ‌లం రు.28 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: