టాలీవుడ్ లో జనాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల గురించి ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో ఆయన పెళ్లి గురించి కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీ గా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత అన్నీ పెద్ద సినిమాలే చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఆయన కమర్షియల్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్నారు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర నిర్మాతలు అందరూ ఆయన సినిమాలకు భారీగా పెట్టుబడులు పెట్టడానికి దాదాపుగా సిద్దమవుతున్నారు. 

 

ప్రభాస్ కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఆయన తన పెళ్లి మీద మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆయన పెళ్లి మీద ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఏ స్పష్టమైన సమాచారం రావడం లేదు. అటు కుటుంబం అప్పుడప్పుడు ప్రకటనలు చేయడం ఇటు సోషల్ మీడియాలో ఏదోక వార్తలు రావడం వంటివి అభిమానులను కాస్త అయోమయానికి గురి చేస్తున్నాయి. టాలీవుడ్ జనాలు కూడా సోషల్ మీడియాలో వార్తల ను చూసి ఆయన పెళ్లి అప్పుడు అవుతుంది ఇప్పుడు అవుతుంది అంటూ ఎదురు చూస్తున్నారు. 

 

కాని ప్రభాస్ మాత్రం ఈ విషయంలో ఒక్క ముందు అడుగు కూడా వేయడం లేదు అనే విషయం అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఆయన పెళ్లిని రహస్యంగా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయనకు సంబంధం ఇప్పటికే కుదిరింది అంటున్నారు. దాదాపు ఈ పెళ్లి వేసవిలో రహస్యంగా విదేశాల్లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. కాని కొందరు సన్నిహితులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించే ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ఆహ్వానాలు టాలీవుడ్ పెద్దలకు కొందరికి అందే అవకాశం ఉందని సమాచారం. చూడాలి మరి ఇది నిజమో కాదో.

మరింత సమాచారం తెలుసుకోండి: