టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఆయన సినిమాల మీద జనాలకు ఒక క్రేజ్ అనేది సాధారణంగా ఉంటుంది. అందుకే ఆయన సినిమా విడుదల అవుతుంది అనగానే పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియాతో పాటుగా ప్రధాన మీడియాలో కూడా హడావుడి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి తన 152 వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. 

 

దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సినిమా షూటింగ్ లో దాదాపు కీలక భాగాలు అన్నీ పూర్తి అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చిరంజీవి పాత్రలకు సంబంధించి షూటింగ్ కీలక దశకు చేరుకుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇటీవల చిరంజీవి లుక్ కూడా లీక్ అయింది. దీనితో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా కథ ఏ విధంగా యుంటుంది అనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. కథ విషయంలో చిరంజీవి ఇప్పటికే పలు జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

సినిమా కథ సామాజిక నేపధ్యంలో ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్ బాబుతో చేసిన ‘శ్రీమంతుడు’ సినిమాలో  గ్రామాల అభివృద్ధి గురించి చెప్పిన కొర‌టాల‌ శివ ‘జ‌న‌తాగ్యారేజ్‌’లో మొక్క‌లు, ప‌ర్యావ‌ర‌ణం ఆవ‌శ్య‌క‌త‌ను చెప్పారు. అలాగే ‘భ‌ర‌త్ అనే నేను’ చిత్రంలో రాజ‌కీయ నాయ‌కులు గురించి ప్ర‌స్తావించారు. ఆ సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు కొర‌టాల ప్ర‌స్తుతం ‘ఆచార్య’ చిత్రంలో మరో సామాజిక అంశాన్ని చూపించ‌బోతున్నార‌ని అంటున్నారు. అట‌వీ  భూముల ప‌రిర‌క్ష‌ణ‌. అట‌వీ భూముల ప‌రిర‌క్ష‌ణ‌పై ఓ మాజీ న‌క్స‌లైట్  చేసే పోరాటం ఆధారంగా సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: