టాలీవుడ్ లో ప్రస్తుతం తమిళ రీమేక్ సినిమాల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ సూపర్ హిట్టయిన 96 సినిమాని ఇక్కడ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు జాను గా రీమేక్ చేశారు. కాని సినిమా అనుకున్నంతగా సక్సస్ కాలేదు. ఇక మరో స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు కోలీవుడ్ లో సూపర్ హిట్టయిన సినిమాని ఆయన సోదరుడు విక్టరి వెంకటేష్ తో నారప్ప టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు కోలీవుడ్ లో సూపర్ హిట్టయినప్పటికి మన దగ్గర మాత్రం దారుణంగా ఫ్లాపవుతున్నాయి. ఇప్పుడు రెండు సినిమాలు ఎలాంటి సక్సస్ ని అందుకుంటాయోనన్న ఉత్సుకత సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల తో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న బాలీవుడ్, కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'వకీల్ సాబ్' తో పాటు వెంకీ 'నారప్ప' మీద భారీ అంచనాలతో పాటు అనుమానాలు ఉన్నాయి. 

 

ఇదిలా ఉంటే మార్చ్ లో సినిమాల సందడి చాలా తక్కువగా ఉంది. పెద్ద సినిమాలే కాదు మీడియం రేంజ్ సినిమాలు కూడా రిలీజ్ కావడం లేదు. మార్చ్ చివరి వారంలో నాని 'వి' సినిమా తప్ప మిగతావన్నీ చిన్న సినిమాలే. అయితే మొదటి వారంలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నింటి కంటే కూడా కాస్త బజ్, ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి గాని ఉన్న సినిమా  పలాస 1978. పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. పలాస మార్కెట్ లో జరిగిన హత్య చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాని రూపొందించారు. తాజాగా ప్రమోషన్లలో పాల్గొన్న చిత్ర దర్శకుడు ఈ సినిమా తమిళ హిట్ సినిమా అయిన అసురన్ తో పోలుస్తు ఆసక్తిని రేపాడు. 

 

పలాస సినిమాని చాలా ఆసక్తికరమైన అంశంతోనే తెరకెక్కించామని దర్శకుడు వెల్లడించాడు. అంతేకాదు అసురన్ సినిమా మాదిరిగా బ్లాక్ బస్టర్ అవబోతుందని పలాస యూనిట్ ధీమాగా ఉంది. మరి ఈ సినిమా గనక హిట్ అయితే వెంకీ కోసం సురేష్ బాబు ఈ సినిమాని కొంటారేమో అన్న కామెంట్స్ పడుతున్నాయి. అయితే ఆ చాన్స్ లేదు. ఎందుకంటే పలాస తమిళ సినిమా కాదు స్ట్రైట్ సినిమా.  

మరింత సమాచారం తెలుసుకోండి: