నిజ జీవితంలో ముఖ్యంగా దాంపత్య జీవితంలో ముద్దులకు ఉన్న ప్రాధాన్యత ఎంతో.. అందుకే సినిమాల్లోనూ ముద్దు సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. దర్శకుడు ఈ ముద్దు సీన్లు సరిగ్గా తీయాలే కానీ.. సినిమా ఫలితాన్ని సైతం ప్రభావితం చేసే శక్తి వీటికి ఉంది. అందుకే సినిమా హీరోలు కూడా ఈ ముద్దు దృశ్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వారిలో హీరో మహేశ్ బాబు కూడా ఉన్నాడు.

 

 

కెరీర్ ఆరంభంలోనే బోలెడంత మంది అమ్మాయిల మ‌న‌సుల‌ను కొల్లగొట్టిన మహేశ్ బాబు ఆ తర్వాత కూడా వీలునుబట్టి ముద్దు సీన్లు చేశాడు.. అతడులో త్రిష‌తోనూ, బిజినెస్ మాన్‌లో కాజ‌ల్‌తో, దూకుడులో స‌మంత‌తో ముద్దు స‌న్నివేశాల్లో జీవించాడు మ‌హేశ్‌. ఇద్దరి పిల్లల‌కు తండ్రి అయిన‌ప్పటికీ మ‌హేశ్ మీద అభిమానం ఏమాత్రం త‌గ్గలేదు అమ్మాయిల‌కి. అత‌డి నుంచి మ‌రిన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు చేయాల‌ని వారంతా కోరుకుంటుంటారు.

 

 

అయితే ఇప్పుడు మహేశ్ బాబు తీరు మార్చుకున్నాడు. ఇక‌పై ముద్దు స‌న్నివేశాలు లిప్ లాక్‌లు వ‌ద్దని ద‌ర్శకులకు చెబుతున్నాడ‌ట‌. ముద్దంటే చేదని..తనకా ఉద్దేశం లేదని అంటున్నాడు ప్రిన్స్ మ‌హేశ్ బాబు. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అయిన ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇప్పుడు మాత్రం ముద్దంటే వ‌ద్దంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆయన ఇటీవలి సినిమాల్లో లిప్ లాక్ సీన్ పెట్టించాలని కొందరు దర్శకులు ప్రయత్నించి ఫెయిలయ్యారట.

 

 

ఇంత‌కుముందు ప‌రిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అని అంటున్నాడట మహేశ్ బాబు.. త‌న సినిమాను త‌న కుమారుడు గౌతం, కుమార్తె సితార‌లతో క‌లిసి చూస్తున్నాన‌ని.. ఇలాంటి స‌న్నివేశాలు వారికి ఇబ్బంది క‌లిగిస్తాయ‌ని మహేశ్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. త‌న‌కు ముందు ముందు ఇలాంటి సీన్లు రాయొద్దని చెబుతున్నాడట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: