ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమాల్లో పాశ్చాత్య సంస్కృతులు, పోకడలు బాగా ఎక్కువ అవడంతో పాటు సినిమాలను చూసే ప్రేక్షకుల ఆలోచనల్లో ఊహించలేనంతగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమాలో శృంగార సన్నివేశాలు, లిప్ లాక్ సన్నివేశాలు వంటివి ఉంటే, అటువంటి సినిమాలు చూసేందుకు చాలామంది ప్రేక్షకులు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుతం వస్తున్న చాలావరకు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లేనిదే అక్కడి దర్శకులు సినిమాలు తీయడం లేదనేది వాస్తవం. 

 

ఇక అదే పద్ధతులు మన సౌత్ సినిమాలో కూడా ప్రవేశించాయి. అయితే అంత ఎక్కువమోతాదులో కాకపోయినా, లిప్ లాక్ సీన్స్ వంటివి మాత్రం ప్రస్తుతం మన సినిమాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇక లిప్ లాక్ సన్నివేశాలు వంటివాటిలో నటించడంలో అప్పటికి, ఇప్పటికి కింగ్ గా చెప్పుకునేది లోకనాయకుడు కమల్ హాసన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన నటించిన సినిమాల్లో దాదాపుగా చాలా సినిమాల్లో హీరోయిన్లతో కమల్ లిప్ లాక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. కొన్నేళ్ళ క్రితం రాణి ముఖర్జీ, వసుంధర దాస్ లతో కలిసి ఆయన నటించిన హే రామ్ మొదలుకొని, మొన్నటి విశ్వరూపం2 లోని పూజ కుమార్ వరకు దాదాపుగా అందరు హీరోయిన్లతోనూ ఆయన లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. 

 

అయితే కమల్ సినిమా అనగానే ఆయన అభిమానులు కూడా ఆ తరహా లిప్ లాక్ సన్నివేశాలు తప్పనిసరిగా సినిమాలో ఉండి తీరుతాయని ఆశించడం పరిపాటి అయింది. ఎంతో సహజ నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న కమల్ హాసన్, ఇటువంటి సన్నివేశాల్లో ఎక్కువుగా నటించడంపై అక్కడక్కడ కొందరు విమర్శలు చేసినప్పటికీ, అది నటనలో భాగమని, అందుకని ఆ విషయమై ప్రత్యేకించి ఆయనను విమర్శించడం సరికాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: