నేచురల్ స్టార్ నాని, జీనియస్ డైరెక్టర్ మణిరత్నం క్లాసిక్ ని టచ్ చేసి రిస్క్ చేస్తున్నాడా.. మణిసార్ ఇంటెన్సీని నాని, డైరెక్టర్ రీ ప్రొడ్యూస్ చేస్తాడా.. కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన కాన్సెప్ట్ తో నేచురల్ స్టార్ బాక్సాఫీస్ హిట్ కొట్టబోతున్నాడా..?

 

దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని టక్ జగదీశ్ గా నటిస్తున్నాడు. నిన్ను కోరి హిట్ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో దర్శకుడు శివ నిర్వాణపై మరింత బాధ్యత పెరిగింది. ఈ దర్శకుడి స్క్రిప్ట్ సెలక్షన్ లో సక్సెస్ ఉందని అంటున్నారు. ఈ క్రమంలో టక్ జగదీశ్ ని శివ నిర్వాణ మణిరత్నం క్లాసిక్ హిట్ స్ఫూర్తితో చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.  

 

సింపుల్ కథల్ని తెరపై గాఢమైన ఎమోషన్స్ తో చూపించడంలో శివ నిర్వాణ సత్తా చాటుతున్నాడు. తొలి రెండు సినిమాల్లో ఎమోషన్ టచ్ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ రెండు స్టోరీలు కూడా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే కావడం విశేషం. అయితే టక్ జగదీశ్ సినిమాను శివ నిర్వాణ, మణిరత్నం అగ్ని నక్షత్రం సినిమా స్పూర్తితో రూపొందిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. 

 

అగ్నినక్షత్రం సినిమా ఘర్షణ టైటిల్ తో తెలుగులో విడుదలైంది. టక్ జగదీశ్ స్టోరీ, ఎమోషన్స్ పరంగా అగ్ని నక్షత్రం అంత డెప్త్ ఉంటుందని వినికిడి. ఇందులో నిజం ఎంతనేది రిలీజైతే కానీ తెలియదు. మణిరత్నం కల్ట్ క్లాసిక్ నే టచ్ చేస్తున్నాడంటే ఏ మాత్రం తేడా కొట్టినా విమర్శలు తప్పవు. మరి టక్ జగదీశ్ తో ఎలా కన్విన్స్ చేస్తాడనేదే శివ నిర్వాణకు సవాల్ గా మారింది.చూద్దాం మరి.. శివ నిర్వాణ ఏమాయ చేస్తాడో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: