లిప్ లాక్... సాధారణంగా ఇది బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనుకునే వారు చాలా మంది. అక్కడి హీరోలు హీరోయిన్లు లిప్ లాక్ కి భయపడరు అనే అభిప్రాయం ఉంటుంది. ఇతర సినీ పరిశ్రమల విషయానికి వస్తే మాత్రం ఇది కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. దర్శకులు, నిర్మాతలు కథల్లో పత్యేకంగా లిప్ లాక్ సీన్స్ రాసుకున్నా సరే హీరోలు, హీరోయిన్లు నటించడానికి కాస్త భయపడుతూ ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్ కాస్త ముందు అడుగు వేసింది. 

 

ఆ సినిమాలో విజయ్ దేవరకొండ, శాలినీ పాండే లిప్ లాక్ టాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పింది అనే చెప్పవచ్చు. అప్పటి వరకు లిప్ లాక్ కి భయపడిన టాలీవుడ్ జనం అక్కడి నుంచి దూకుడు పెంచారు. ఆ లిప్ లాక్ బాలీవుడ్ లో కూడా హైలెట్ అయింది. బాలీవుడ్ జనాలు కూడా అంత ధైర్యంగా లిప్ లాక్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు కూడా. కాని అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వాళ్ళు కూడా లిప్ లాక్స్ విషయంలో వైఖరి మార్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. 

 

ఆ లిప్ లాక్ అదే స్థాయిలో వివాదం అయింది. అసలు ఎన్ని వివాదాలు వచ్చినా సరే సినిమా యూనిట్ కూడా వెనక్కు తగ్గలేదు. ప్రేక్షకులు కూడా కనపడకుండా ఆదరించారు అనే చెప్పవచ్చు. దీనిపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా విజయ్ దేవరకొండ కూడా తన లిప్ లాక్ ని సమర్ధించుకున్నాడు. బాలీవుడ్ జనాలు అయితే సినిమాలో లిప్ లాక్ ని లీగల్ చేసేసారు అంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా విజయ్ దేవరకొండ సినిమాల్లో లిప్ లాక్ అనేది సాధారణం అయిపోయింది. అతని సినిమా అంటేనే లిప్ లాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: