సౌత్ సిని పరిశ్రమలో ముఖ్యంగా టాలీవుడ్ లో స్వీటీ అనుష్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాగమతి తర్వాత అనుష్క కొద్దిపాటి గ్యాప్ తర్వాత నిశ్శబ్ధం సినిమా చేసింది. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క గురించి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. అయితే లేటెస్ట్ గా అనుష్క కూడా వెబ్ సీరీస్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఈమధ్య స్టార్స్ అంతా వెబ్ సీరీస్ ల మీద మోజు పెంచుకున్నారు. అమేజాన్ ప్రైం అందులో సూపర్ స్పీడ్ లో ఉంది. కొత్తగా వచ్చిన అహా ఓటిటిలో కూడా వెబ్ సీరీస్ లు భారీగా ప్లాన్ చేస్తున్నారు.

 

అనుష్క కూడా అమేజాన్ ప్రైం వెబ్ సీరీస్ లో నటిస్తుందని తెలుస్తుంది. విక్రం కె కుమార్ డైరక్షన్ లో రాబోతున్న ఈ వెబ్ సీరీస్ లో నాగ చైతన్య సరసన అనుష్క నటిస్తుందని తెలుస్తుంది. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న మొదటి కాంబో ప్రాజెక్ట్ ఇది. నాగార్జునతో జత కట్టిన అనుష్క ఆయన కొడుకుతో మొదటిసారి జోడీ కడుతుంది. అమేజాన్ ప్రైం వెబ్ సీరీస్ వల్ల అది సాధ్యమవుతుంది. ఓ విధంగా స్వీటీ ఫ్యాన్స్ ను ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సినిమాలు చేసినా చేయకపోయినా వెబ్ సీరీస్ లు ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి.

 

ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ వెబ్ సీరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు అనుష్క కూడా ఆ లిస్ట్ లో చేరింది. అమేజాన్ ప్రైం లో రానున్న ఈ వెబ్ సీరీస్ ఎలా ఉంటుంది. ఈ వెబ్ సీరీస్ లో అనుష్క ఎలా కనిపించనుంది అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గౌతం మీనన్ అనుష్కతో ఏ మాయ చేసావే సీక్వల్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అదే జరిగితే అనుష్క ఫ్యాన్స్ అందరికి పండుగ చేసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: