సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే సెన్సార్‌ బోర్డ్ అనుమతి తప్పని సరి. సినిమాలో కంటెంట్, సీన్స్‌, డైలాగ్స్‌ ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని క్షుణంగా పరిశీలించి సినిమా విడుదలకు అనుమతి ఇస్తారు సెన్సార్‌ సభ్యులు. అయితే ఒక్కోసారి సెన్సార్ బోర్డ్‌ నిర్ణయాలు వివాదాస్పదమవుతుంటాయి. డైరెక్టర్‌ ఎంతో క్రియేటివ్‌గా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలను సెన్సార్ కమిటీ తొలగించాలని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యం ఇంటిమేట్‌, హాట్ సీన్స్‌ విషయంలో ఇలాంటి వివాదాలు కనిపిస్తుంటాయి. అలా అత్యంత వివాదాస్పదమైన బాలీవుడ్ సీన్స్‌ చాలానే ఉన్నాయి.

 

వీటిలో ముందుగా చెప్పెకోవాల్సిన సినిమా గలియోకి రాస్‌లీలా.. రామ్‌ లీలా. రియల్‌ లైఫ్‌ హాట్ పెయిర్‌ దీపికా పదుకొనే, రణవీర్‌ సింగ్‌లు రీల్‌ లైఫ్‌లోనూ కలిసి నటించిన సినిమా రామ్ లీలా. పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని ఇంటిమేట్‌ సీన్స్‌ ఉన్నాయి. అయితే ఈ సీన్స్‌ విషయంలో సెన్సార్‌ బోర్డ్ అభ్యంతరం తెలిపింది. బాలీవుడ్‌ సక్సెస్‌ ఫుల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ రేస్‌ సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. సీనియర్ హీరో సైఫ్‌ అలీఖాన్‌, బిపాసా బసుల మధ్య తెరకెక్కించిన రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

 

ఇటీవల అత్యంత వివాదాస్పదమైన సినిమా లిప్‌ స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా. ఈ సినిమా టైటిల్‌ దగ్గర నుంచే వివాదం మొదలైంది. స్త్రీలలో ఉండే తీవ్రమైన కోరికలు, స్వాతంత్ర్యం కోసం వారు చేసే పోరాటల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా హాట్‌ సీన్స్‌ ఉన్నాయి. దీంతో సెన్సార్ టీ ఈ సినిమాకు సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే చిత్రయూనిట్‌ ఫిలిం సర్ఫిఫికేషన్‌ ట్రిబ్యూనల్‌లో పోరాడి మరీ సినిమాకు సర్టిఫికేట్ తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: