టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి గురించి బాలీవుడ్ చాలా రోజులు మాట్లాడుకుంది. అక్కడి యువ హీరోలు అయితే ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు. చివరికి ఆ సినిమాను షాహిద్ కపూర్ చేసారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడ కూడా సందీప్ రెడ్డి వంగా నే నిర్మాతగా వ్యవహరించారు. ఇక వసూళ్లు కూడా భారీగానే సాధించింది ఈ సినిమా. బాలీవుడ్ జనాలు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. అదే రేంజ్ లో చూపించాడు సందీప్. 

 

ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ సన్నివేశాలు బాలీవుడ్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమాలో 60 లిప్ సన్నివేశాలను పెట్టిన దర్శకుడు సందీప్ బాలీవుడ్ కి వెళ్లేసరికి ఆ కోటా ని మరింతగా పెంచాడు. అక్కడ దాదాపు 75 కి పైగా సన్నివేశాలను పెట్టారు సినిమాలో. ఇది అక్కడి యూత్ ని ఎంతో విశేషంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ముఖ్యంగా కైరా అద్వాని సీనియర్ హీరో పక్కన ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నటించింది. లిప్ లాక్ అంటే ఇంత ఈజీ గా ఉంటుందా అనే రేంజ్ లో పెట్టుకున్నారు ఈ ఇద్దరు. 

 

దీనిపై కొందరు విమర్శలు కూడా చేసినా బాలీవుడ్ ట్రెండ్ మారింది. అక్కడ కూడా దర్శకులు ఈ సినిమా తర్వాత కాస్త కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి లిప్ లాక్ ని పూర్తిగా కమర్షియల్ చేసేసారు దర్శకులు నిర్మాతలు. సోషల్ మీడియా కూడా లిప్ లాక్ సన్నివేశాలు ఉంటే మాత్రం సినిమాకు బాగా ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా యూత్ ని ఈ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ విధంగా టాలీవుడ్, బాలీవుడ్ కి లిప్ లాక్ సన్నివేశాల విషయంలో కొత్త పాఠాలు నేర్పింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: