ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లవ్‌ స్టోరి టైటానిక్‌. ఈ సినిమాలో లవ్‌ సీన్స్‌ ఎంత పాపులరో.. ఈ సినిమాలో హీరోయిన్‌ నగ్న చిత్రాన్ని హీరో చిత్రీకరించే సన్నివేశం  కూడా అదే ఫేమస్‌. అప్పట్లో ఇండియన్‌ సినిమా లవర్స్‌కు అది విచిత్రంగా అనిపించినా.. తరువాత దాదాపు అలాంటి సీనే ఒకటి ఇండియన్‌ సినిమా తెర మీద కూడా కనిపించింది. రణదీప్‌ హుడా ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ హూవీ రంగ్ రసీయా ఈ సినిమాలోనే టైటానిక్‌ తరహా సన్నివేశం ఉంది.

 

19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా కేతన్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రంగ్ రసియా`. రణదీప్ హుడా, నందనా సేన్ ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు ఆరేళ్ల పోరాటం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది.  ఈ చిత్రంపై రాజా రవివర్మ మనవరాలు ఇంద్రాదేవి కుంజమ్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. 

 

ఈ సినిమాలో రణదీప్‌ హుడా, హీరోయిన్‌ నందనా సేన్‌ ఫోటోను బొమ్మను గీసే సన్నివేశాన్ని బోల్డ్‌గా తెరకెక్కించారు. ఈ సీన్స్‌లో బోల్డ్‌ గా నటించిన నందనా సేన్‌ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ దేశాయ్ రాసిన `రాజా రవివర్మ` పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని రాజా రవివర్మ జీవితకథకు ఆపాదించడంపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజా రవివర్మ జీవితగాధకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్న ప్రకటన లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదన్నారు. పలు అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శితమైన ఈ సినిమాకు దీపా సాహి నిర్మాత. సందేశ్‌ శాండిల్య సంగీతమందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: