సినిమా రంగానికి చెందిన ప్రముఖులంతా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే వారు. తెలుగుదేశం పార్టీ ని సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించేవారు. ఆ తర్వాత టిడిపి ప్రభుత్వంలో అనేక కీలక పదవులు కూడా సినిమా రంగానికి చెందినవారు పొందుతూ ఉండేవారు. ఇదంతా మొదటి నుంచి వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు టిడిపి పని దాదాపుగా అయిపోయినట్టుగా కనిపిస్తుండడంతో వీరంతా వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో జగన్ పరిపాలనపై  ప్రజలు సంతోషంగా ఉండడం, జగన్ కూడా అంతే స్థాయిలో తన పరిపాలన కొనసాగిస్తూ, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల, అన్ని వర్గాల వారిని ఆదరిస్తూ వస్తుండడంతో సినీ పెద్దల కన్ను మొత్తం ఇప్పుడు వైసీపీ మీద పడినట్లు తెలుస్తోంది . 

IHG


తాజాగా టాలీవుడ్లో టాప్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , శ్యాం ప్రసాద్ రెడ్డి, నల్లమలపు బుజ్జి వంటివారు జగన్ ను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. హుదూద్ తుఫాను సమయంలో టాలీవుడ్ ఆధ్వర్యంలో పక్కా ఇళ్లు నిర్మించారు. ఇప్పుడు ఆ ఇళ్లను  ప్రారంభించాల్సిందిగా జగన్ ను వారు కోరినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయట. గత కొంతకాలంగా సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ కలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి జగన్ను కలిసి మద్దతు ప్రకటించారు. దగ్గుపాటి సురేష్ తదితరులు జగన్ను కలిసి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీనికి కారణం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. అంతకు ముందు రెండు దశాబ్దాల క్రితమే దగ్గుబాటి రామానాయుడు విశాఖలో స్టూడియో నిర్మించారు. అంతే కాకుండా అక్కడ సినీ ప్రముఖులు అందరికి భారీగా భూములు కూడా ఉన్నాయి.


 ఆ నేపథ్యంలోనే చిరంజీవి కూడా విశాఖను రాజధానిగా ఏర్పాటు చేసేందుకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు వైసిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వీరందరికీ దగ్గుపాటి సురేష్ నేతృత్వం వహించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక జగన్ కూడా సినీ ప్రముఖులు వైసీపీలో చేరే విషయంలో సానుకూలంగా ఉండడంత వీరంతా వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: