టాలీవుడ్ లో ఇప్పుడు లిప్ లాక్ కల్చర్ ఓ రేంజ్ లో కొనసాగుతుందని చెప్పొచ్చు. యువ హీరోల సినిమాలే కాదు స్టార్ సినిమాల్లో కూడా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ సినిమాలో కంటెంట్ తో పాటుగా లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటున్నాయి. ఇక కుర్ర హీరోల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం వీటితోనే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయంటే నమ్మాల్సిందే. సినిమాలో హీరో హీరోయిన్ లిప్ లాక్ సినిమాకు మంచి మైలేజ్ తెచ్చిపెడుతున్నాడు. అందుకే అవసరం ఉన్నా లేకున్నా వారి మధ్య ఓ ఘాటు ముద్దు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

 

అయితే అంతకుముందు ఎలా ఉన్నా ఈ లిప్ లాక్ సినిమాల రచ్చ మొదలైంది మాత్రం అర్జున్ రెడ్డి సినిమా నుండే అని స్పెషల్ గా చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ, షాలిని పాండే ఇద్దరు మూతి ముద్దుల్లో పి.హెచ్.డి చేసేశారు. సినిమాలో ఎంత డెప్త్ కంటెంట్ ఉందో అదే రేంజ్ లో లిప్ లాక్ రచ్చ కొనసాగించారు. ఆ సినిమా హిట్ అవడంలో ఈ లిప్ లాక్స్ కూడా ప్రధాన పాత్ర పోశించాయని చెప్పడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డికి ముందు ఏదో ఒకటి అరా ముద్దులతో సినిమాలు కానిచ్చేవారు. ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా వచ్చిందో అప్పటి నుండి ప్రత్యేకంగా మూతి ముద్దులతో సినిమాలు వస్తూ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాయి.

 

ఒకప్పుడు హీరోయిన్స్ వీటికి నిరాకరించినా ఇప్పుడొస్తున్న భామలు అన్నిటికి సిద్ధం అనేస్తున్నారు. టాలీవుడ్ ముద్దుల వీరుడిగా విజయ్ దేవరకొండ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. అతని సినిమాల్లో కచ్చితంగా లిప్ లాక్స్ ఉండాల్సిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ లిప్ లాక్, హాట్ సీన్స్ రచ్చ ఉండేది ఇప్పుడు అది టాలీవుడ్ కు పాకింది. మరి ఈ మూతి ముద్దుల హంగామా తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకెన్నాళ్లు కొనసాగుతాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: