తెలుగు చిత్ర పరిశ్రమలో లిప్ లాక్  ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి ఈ ట్రెండ్ వచ్చినప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ప్రస్తుతం బాలీవుడ్ కంటే టాలీవుడ్లోనే ఎక్కువైపోయింది. ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే లేకపోతే అటు ప్రేక్షకులు హర్ట్ అవుతారు. ఇక  హీరోలు కూడా లిప్ లాక్ సీన్లలో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా లిప్ లాక్  కనిపిస్తూ ఉన్నాయి. అయితే టాలీవుడ్లో చాలా మంది ప్రేక్షకులు... లిప్ లాక్ సీన్లు అర్జున్ రెడ్డి సినిమా తో బాగా ఫేమస్ అయ్యాయి అని అనుకుంటారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత లిప్ లాక్ ట్రెండ్ బాగా నడుస్తుంది అనుకుంటారు. 

 

 

 కానీ టాలీవుడ్ లో  లిప్ లాక్ సీన్ లను పరిచయం చేసింది అక్కినేని దంపతులైన నాగచైతన్య సమంత. నాగచైతన్య సమంత జోడిగా నటించిన మొదటి సినిమామాయ చేసావే. ఈ సినిమాలో నాగచైతన్య సమంత మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ అన్ని తెలుగు ప్రేక్షకులందరికీ ఎవర్గ్రీన్ గా నిలిచిపోయాయి. ఈ సినిమా ఇద్దరికీ మంచి విజయాన్ని సాధించి పెట్టింది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో లిప్ లాక్ కేవలం సినిమా వరకు మాత్రమే పరిమితం కాలేదు.. ఏకంగా ఆ ఇద్దరిని భార్యాభర్తలను కూడా చేసింది. ఏ మాయ చేసావే సినిమాలో లిప్ లాక్ ల ద్వారా బాగా రొమాన్స్ పండించడమే కాదు ఇద్దరు ప్రేమలో కూడా పడ్డారు. 

 

 

 ఇక ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు ఇలా ప్రేమలో కొనసాగి ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు  ఈ జంట. ప్రస్తుతం మోస్ట్ క్యూట్  లవ్వబుల్ కపుల్ గా  టాలీవుడ్ లో అందరికీ ఫేవరేట్ గా మారిపోయింది ఈ జంట.  ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మనం సినిమాలో మరోసారి కలిసి నటించి... తమ లిప్ లాక్ తో ప్రేక్షకులను అలరించారు. ఇలా ఇద్దరు అక్కినేని దంపతులు... ఒక్క లిప్ లాక్ సీన్ తోనే ఒక్కటయ్యారు అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: