జబర్దస్త్ నుండి నాగబాబు బయటకి వచ్చిన తర్వాత ఎంతో హడావిడిగా జబర్దస్త్ కి పోటీగా అదిరింది ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. జబర్దస్త్ ని పడగొట్టే రేంజ్ లో స్కిట్లు చేయాలన్న ఉద్దేశ్యంతో అప్పట్లో జబర్దస్త్ లో చేసిన స్టార్ కమెడియన్లు అందరినీ పట్టుకొచ్చారు. అయితే ఎంత మందిని పట్టుకొచ్చినా అదిరింది జబర్దస్త్ స్థాయికి రాలేకపోయింది. నాగబాబు వెళ్లాక కూడా జబర్దస్త్ అదే స్థాయిలో తీఆర్పీని తెచ్చుకుంటూ టాప్ లో ఉంది.

 

 

 

అయితే ప్రస్తుతం అదిరింది ప్రోగ్రామ్ లో ఎన్నో మార్పులు చేశారు. ఆ మార్పుల్లో భాగమే యాంకర్ సమీరాని తొలగించారు. ఆమె స్థానంలో పటాస్ యాంకర్ రవి, భానులని తీసుకొచ్చారు. అయితే సడెన్ గా సమీర కనిపించకపోయేసరికి కారణం ఏమై ఉంటుందా అనుమానాలు మొదలయ్యాయి. ఒకానొక కారణంగా ఆమెకి మొన్ననే పెళ్లయిందని, ఇప్పుడు గర్భవతి అని అందుకే అదిరింది షోని మానేసిందని పుకార్లు రేగాయి.

 

 

ఈ వార్తలపై స్పందించిన సమీర తనని అదిరింది ప్రోగ్రామ్ నుండి ఎందుకు  తీసేశారో తనకు తెలియదని, గర్భవతి అనే మాటలు నిజం కాదని చెప్పుకొచ్చింది. జబర్దస్త్ లో హాట్ యాంకర్లయిన రష్మి, అనసూయలు ఆ షోకి మరింత అందాన్ని తెస్తారన్నది నిజమే. కానీ ఆ ఒక్క విషయం వల్లే షో సక్సెస్ కాలేదు. కంటెంట్ పరంగా జబర్దస్ట్ చాలా ముందున్న విషయం అదిరింది గుర్తుంచుకోవాలి.

 

 

కేవలం అవతలి వారిని కొట్టడం వల్లే నవ్వులు తెప్పించగలమని భావిస్తున్న అదిరింది షో తన స్కిట్లని చాలా మటుకు మార్చుకోవాల్సి ఉంటుంది. యాంకర్ అనేది కేవలం ఆడ్ ఆన్ అవుతుందే తప్ప షో చూసే ఇంట్రెస్ట్ కలగదని చెప్తున్నారు. మరి ఇకనైనా మార్చాల్సింది మారిస్తే బాగుంటుందని.. అప్పుడే జబర్దస్త్ షోల సక్సెస్ అవుతుందని సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: