బాలీవుడ్‌బాద్‌షా షారూక్ ఖాన్ ఎంత రొమాంటిక్ హీరోనో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలంటే దాదాపు రొమాన్స్ కామ‌న్‌గా ఉంటుంది. ఇక కాజ‌ల్ షారూక్ అంటే హిట్ ల‌వ్ పెయిర్ కింద అంద‌రూ చెప్పుకుంటారు. ఈ పెయిర్ తెర మీద క‌నిపించిందంటే చాలు థియేట‌ర్‌లో విజిల్స్ మోత మోగాల్సింది. ఇక ఎన్నో సినిమాల్లో వారిద్ద‌రూ రొమాన్స్ పండించిన విష‌యం తెలిసిందే. అయితే వీరిద్ద‌రూ క‌లిసిన న‌టించిన సినిమాల‌న్నీ కూడా సూప‌ర్‌డూప‌ర్ హిట్లే బాజీఘ‌ర్‌, ర‌బ్‌నే బ‌నాయా జోడీ, క‌రన్ అర్జున్‌, కుచ్‌కుచ్ హోతా హై, మైనేమ్ ఈజ్ ఖాన్‌, దిల్‌వాలేదుల్హ‌నియా లేజాయే, క‌భీకుషీ క‌భీ గ‌మ్ ఇలా ఎన్నో చిత్రాల్లో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు. 

 

ఈ చిత్రాల‌న్నీ కూడా  బాక్సాఫీస్‌ క‌లెక్ష‌న్ల‌ని కొల్ల‌గొట్టాయి. మంచి హిట్ అనిపించుకున్నాయి. ఇక వీటిలో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమాలు కేవ‌లం బాలీవుడ్‌లో మాత్ర‌మే కాక తెలుగులో కూడా డ‌బ్ చేశారు. ఈ చిత్రం ఇక్క‌డ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయి రికార్డులు బ‌ద్ద‌ల కొట్టాయి. వాటిలో దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయే చిత్రం తెలుగులో ప్రేమించి పెళ్ళాడ‌తా అని తెలుగులో వ‌చ్చింది. ఈ చిత్రం దాదాపు ఒకే థియేట‌ర్‌లో 17 సంవ‌త్స‌రాల పాటు ఆడింది. ముంబ‌యిలోని మ‌రాఠా మందిర్ థియేట‌ర్‌లో ఆడింది. అంత పెద్ద హిట్ సాధించింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రానికి సాంగ్స్ కూడా అటు హిందీ ఇటు తెలుగులో బాగా కుదిరాయి.

 

ఆ త‌ర్వాత కాజోల్ అజ‌య్‌దేవ‌గ‌న్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్ళైన‌ప్ప‌టికీ కాజోల్ కొన్ని చిత్రాల్లో న‌టించింది. వాటిలో `క‌భి ఖుషి క‌భి గ‌మ్‌` చిత్రంలో చాలా అద్భుత‌మైన న‌ట‌న‌ని క‌న‌బ‌రుస్తారు. అందులో వారిద్ద‌రూ ప్రేమించుకుని వివాహం చేసుకుంటారు. ఆ పెళ్ళి షారూక్ తండ్రి అమితాబ్ కి ఇష్టం ఉండ‌దు దాంతో వారిద్ద‌రూ దూరంగా వెళ్ళి ఉంటారు. ఇక ఈ చిత్రంలో వీరిద్ద‌రి రొమాన్స్ పీక్స్‌లో ఉంటుంది. ఓ పాట‌లో అయితే మ‌రి హ‌ద్దులు మీరి కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో న‌టించారు. `సూర‌జ్ హువా మ‌ద్ద‌న్...చాంద్ జ‌ల్‌నే ల‌గా` అనే పాట‌లో వీరిద్ద‌రి రొమాన్స్ పీక్స్ అని చెప్పాలి. దాంతో ఆ పాట రొమాన్స్ గురించి అప్ప‌ట్లో చాలా మంది కామెంట్స్ చేశారు. అంతే కాక భ‌ర్త అజ‌య్‌దేవ‌గ‌న్ కూడా హ‌ర్ట్ అయి ఇక‌పై షారూక్ తో కాజోల్‌ని న‌టించ‌వ‌ద్ద‌ని చిన్న‌గా వార్నింగ్ కూడా ఇచ్చిన‌ట్లు గుస‌గుస‌లు విన‌పించాయి. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి చాలా కాలం న‌టించ‌లేదు. తిరిగి ఇటీవ‌లె కోయి మిల్‌గ‌యా అనే చిత్రంలో న‌టించారు కానీ ఆశించినంత ఫ‌లితం మాత్రం రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: