ట్రెండ్ మారుతున్న కొద్ది బాలీవుడ్‌లో బోల్డ్ సినిమాలు ఎక్కువుతున్నాయి. ఒకప్పుడు అడపాదడపా మాత్రమే ఈ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ మద్యం కాలంలో ఈ తరహా సినిమాలు చాలానే వస్తున్నాయి. అయితే ఇలాంటి సినిమాల విషయంలో వివాదాలు కూడా కామన్‌ అవుతున్నాయి.

 

వీటిలో కొన్ని సినిమాలను సెన్సార్‌ బోర్డ్‌ నిషేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. లెస్బియన్‌ సెక్సువల్‌ రిలేషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అన్‌ ఫ్రీడం. ఇద్దరు అమ్మాయిల మధ్య ఇంటిమేట్ సీన్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా 2015లో రూపొందింది. అయితే సినిమాలోని బోల్డ్ సీన్స్‌ కారణంగా భారత ప్రభుత్వం ఈ సినిమాను నిషేదించింది. థియేట్రికల్‌ రిలీజ్‌కు నోచుకోని ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

 

బాలీవుడ్‌ వర్సటైల్‌ యాక్టర్‌ నవాజుద్ధీన్‌ సిద్ధీఖీ చాలా ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించాడు. నవాజ్‌, నిహారికా సింగ్‌తో కలిసి నటించిన సినిమా మిస్‌ లవ్లీ. 1980ల కాలంలో బాలీవుడ్‌లో తెరకెక్కిన సీ గ్రేడ్ సినిమాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో లెక్కకు మించి బోల్డ్‌ సీన్స్‌ ఉన్నాయి. దీంతో ఈ సినిమా అప్పట్లో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

 

నిషేదానికి గురైన మరో ఇండియన్‌ సినిమా ఫైర్‌. దీపా మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందితా దాస్‌, షబానా అజ్మీలు కలిసి నటించారు. ఇద్దరు ఆడవాళ్ల మధ్య రొమాన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా నిషేధించినా తరువాత కొన్ని కట్స్‌తో రిలీజ్‌కు అనుమతించారు.

 

మరో వివాదాస్పద బాలీవుడ్‌ బోల్డ్ మూవీ రంగ్‌ రసియా. రణదీప్‌ హుడా, నందన సేన్‌ కలిసి నటించిన ఈ సినిమాను ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవితకథ ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో కూడా బోల్డ్ సీన్స్‌ కాస్త హద్దులు దాటడంతో సినిమా రిలీజ్‌కు చాలా ఆలస్యమైంది. దాదాపు ఆరేళ్ల పోరాటం తరువాత ఈ సినిమా రిలీజ్‌కు నోచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: