సినిమాలో ముద్దులు శృతిమించుతున్నాయా.. బాలీవుడ్, హాలీవుడ్ లో ఇంతకన్నా ఘోరంగా లిప్ లాక్స్, హాట్ సీన్స్ చేస్తున్నారు కదా.. వాటితో పోల్చితే తెలుగులో తక్కువే కదా అనుకోవచ్చు. బాలీవుడ్ లో ఓ కేటగిరికి చెందిన సినిమాలు కేవలం ఇలాంటి అడల్ట్ కంటెంట్ తోనే సినిమాలు చేస్తాయి. స్టార్ సినిమాల్లో పెద్దగా ఈ లిప్ లాక్స్ ఉండవు. తెలుగులో కూడా స్టార్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ తక్కువే అయినా అభిమానులను సంతృప్తి పరచేందుకు వారు కూడా అలాంటి సీన్స్ చేయక తప్పట్లేదు.

 

ఇక యువ హీరోల సినిమాల్లో లిప్ లాక్స్ చాలా కామన్ అయ్యాయి. హీరోయిన్ లిప్ లాక్ కొన్ని సినిమాలకు మంచి పబ్లిసిటీ స్టంట్ గా మారింది. కంటెంట్ ను బట్టి ఈ లిప్ లాక్ సీన్స్ ఉంటే మంచిదే కాని హీరో హీరోయిన్ ఘాడంగా ప్రేమించుకుని వారి ప్రేమను పంచుకునే క్రమంలో ఇలా మూతి ముద్దులతో రచ్చ చేయడం మాత్రం ఏమి బాగాలేదు. పవిత్రమైన ప్రేమని ఇలా లిప్ లాక్ సీన్స్ తో చెడ్డ పేరు తెస్తున్నారు. అదేదో కాజువల్ గా లిప్ లాక్ జరిగినట్టు కాకుండా కోరికతో ఉన్నట్టుగా వాటిని డిజైన్ చేస్తున్నారు.  

 

అలాంటి సీన్స్ చూస్తే ఇవి ప్రేమకు గుర్తుల్లా కాకుండా కామ వాంచ తీర్చుకునేలా ఉండటం జరుగుతుంది. అయితే కొంతమంది ప్రేక్షకులు సినిమాలో ఇలాంటి సీన్స్ ఉంటేనే ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది. అందుకే అలాంటి ప్రేక్షకుల కోసం అవసరం ఉన్న చోట అవసరానికి మించి లిప్ లాక్ సీన్స్, హాట్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పేది ప్రేమ కథ.. అందులో సన్నివేశాలు మాత్రం బి గ్రేడ్ ను తలపిస్తాయి. మరి అలాంటి సినిమాలు తీసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారో ఆ దర్శక నిర్మాతలకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: