ఈ మద్య హర్రర్, కామెడీ నేపథ్యంలో బాగా అలరిస్తున్నాయి.  ఒకప్పుడు హర్రర్ సినిమాలు థియేటర్లోకి వెళ్లి చూడాలంటే జనాలు భయంతో వణికిపోయేవారు.  ముఖ్యంగా రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడు తెరకెక్కించిన హర్రర్ మూవీస్ అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించాయి.  ఇక లారెన్స్ తెరకెక్కించిన ముని సినిమాలో హర్రర్ తో పాడు కడుపుబ్బా నవ్వించే సీన్లు ఉండటతో ప్రేక్షకులు ఈ మూవీని చాలా ఎంజాయ్ చేశారు.  ఇలా ముని సీక్వెల్ గా కామెడీ, హర్రర్ నేపథ్యంలో కాంచన, కాంచన 2 సీక్వెల్స్ తెరకెక్కించాడు లారెన్స్.  త్వరలో కాంచన 4 కూడా రాబోతుందని ప్రకటించారు.  ఇక సుందర్‌.సి దర్శకత్వంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అరణ్మనై’. హారర్‌, కామెడీ జోనర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 

 ఈ చిత్రంవీ తెలుగు లో  'చంద్రకళ'  డబ్ చేసి ఇక్కడ కూడా మంచి విజయం అందుకున్నాడు. ఇందులో హన్సిక, ఆండ్రియా తదితరులు నటించారు. అదే ఫార్ములాతోనే ‘అరణ్మనై 2’ చిత్రంవీ తెరకెక్కించారు. ఇందులో హన్సిక, త్రిష నటించారు.  కాకపోతే ఈ చిత్రం పెద్దగా ఆకర్షించలేదు కానీ భయపెట్టింది.. హారర్‌ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. తాజాగా ఇదే కాంబినేషన్ లో ‘అరణ్మనై 3’ని తెరకెక్కిస్తున్నారు సుందర్‌.సి. ఇందులో రాశీఖన్నా, సాక్షి అగర్వాల్‌, ఆండ్రియా నటిస్తున్నారు.  

 

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గుజరాత్‌లోని ఓ నిజమైన కోటను అద్దెకు తీసుకొని అక్కడ చిత్రీకరణ నిర్వహిస్తున్నారు.  అయితే ఈ మూగ్గురు భామల్లో దెయ్యం ఎవరు అన్నదే సస్పెన్స్.  ఈ చిత్రం వీ డైరెక్షన్ తో పాటు ఆయన కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.  గిబాబు హాస్యపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి కోటలో అత్యంత కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం.  ఈ ముద్దుగుమ్మల్లో ఎవరు భయపెట్టబోతున్నారో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: