టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఇప్పుడు ఒక సంచలనం. ఆమె ఎం చేసినా సరే సంచలనమే. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే వ్యాఖ్యలు, ఆమె చేసే కామెంట్ లు, ఆమె పోస్ట్ చేసే వీడియో లు, ఆమె ఇచ్చే ఇంటర్వ్యులు ఇలా ప్రతీ ఒక్కటి వివాదాస్పదమే. టాలీవుడ్ లో ఇంత తక్కువ కాలంలో ఈ రేంజ్ లో గుర్తింపు వచ్చిన నటి మరొకరు లేరు అనేది వాస్తవం. ఇక రాజకీయ నాయకులను కూడా ఆమె విడిచిపెట్టలేదు. జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలా అందరి మీద ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది. 

 

ఇక క్యాస్టింగ్ కోచ్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని సంచలనం అయ్యాయి. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు విషయంలో ఆమె చేసిన పోస్ట్ లు అన్నీ వైరల్ అయ్యాయి. అవి వివాదాస్పదం కూడా అయ్యాయి. ఆయన కుమారుడు తో ఆమె ఇచ్చిన లిప్ లాక్ సోషల్ మీడియా ను ఊపేసింది. ఆ తర్వాత కొన్ని వీడియో లు కూడా సృష్టించారు కొందరు. ఆ లిప్ లాక్ కి ఆ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక అక్కడి నుంచి శ్రీరెడ్డి ఎప్పుడు ఎం బయటపెడుతుందో అనే భయం జనాల్లో మొదలయింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో కొన్ని వివాదాలకు కేంద్ర బిందువు అయింది అనే మాట అక్షరాలా నిజం. ఇటీవల ఒక డాన్స్ మాస్టర్ ఆమె నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు కేసు కూడా పెట్టాడు. ఆమె ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తుంది. అక్కడ ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి కొందరు ముందుకి వస్తున్నారు. ఇప్పుడు ఆమె సినిమాల మీద కంటే సోషల్ మీడియా మీదే ఎక్కువగా దృష్టి పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: