మేకప్‌ మొగల్‌ కైలీ జెన్నర్‌ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. 22 ఏళ్ల ఈ భామ ఈ అనే టీవీ రియాలిటీ షోతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ బ్యూటీ సొంతంగా కైలీ కాస్మోటిక్స్‌ కంపెనీని స్థాపించింది. 14 ఏళ్ల వయసులోనే ప్రముఖ క్లాతింగ్‌ బ్రాండ్‌ పాక్‌సన్‌తో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తరువాత కాస్మొటిక్‌ ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో టైమ్‌ మ్యాగజైన్‌ జెన్నర్‌ సిస్టర్స్‌ను అత్యంత ప్రభావవంతమైన యువతులుగా పేర్కొంది.

 

ఫోర్బ్స్‌ మేగజైన్‌ లెక్కల ప్రకారం కైలీ సంపద దాదాపు బిలియన్‌ యుఎస్‌ డాలర్లు అని తెలుస్తోంది. టీవీ సిరీస్‌లతో పాటు పలు మ్యూజిక్‌ వీడియోలలోనూ నటించిన ఈ భామ 2018లో రిలీజ్‌ అయిన ఓషియన్స్‌ ` సినిమాలోనూ నటించింది. ప్రపంచంలో అత్యంత ధనవంతురాలైన యువతిగా రికార్డ్ సృష్టించిన తరువాత జెన్నర్‌పై మీడియా ఫోకస్‌ కూడా ఎక్కువైంది.

 

తాజాగా ఈ భామ తన ఫ్రెండ్స్‌ తో కలిసి హాలీడే వేకషన్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని బికినీ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. టీ పీస్‌ బికినీలతో పాటు వన్‌ పీస్‌ మోనోకనీలలో కైలీ చేసిన సందడి సోషల్ మీడియాను ఊపేస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

rise and fucking shine

A post shared by Kylie 🤍 (@kyliejenner) on

మరింత సమాచారం తెలుసుకోండి: