కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీలో పడిన సంగతి తెలిసిందే.  కరోనా వలన ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా కరోనా వలన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ వైరస్ ప్రభావం ప్రభాస్ సినిమాపై కూడా పడినట్టుగా కనిపిస్తున్నది.  ప్రభాస్ 20 వ సినిమా జాన్ ఇటలీ బ్యాక్ డ్రాప్ తో షూట్ చేస్తున్నసంగతి తెలిసిందే. గతంలో కొన్ని రోజులు ఇటలీలో షూట్ కూడా చేశారు.  


అయితే, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సెట్స్ వేసి అక్కడ షూట్ చేస్తున్నారు.  అయితే, కొంత షూటింగ్ కూడా ఇటలీలో చేయాల్సి ఉన్నది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటలీ వెళ్లడం కుదరని పని.  జాన్ సినిమా కోసం త్వరలోనే ఇటలీ వెళ్లి కొంత పార్ట్ సినిమా షూటింగ్ చేయాల్సి ఉన్నది. కానీ, ఇటలీలో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్  ఎక్కువగా ఉండటంతో అక్కడ షూటింగ్ చేయడానికి సందేహిస్తున్నారు.  


ఇండియాలో తప్పించి ఫారెన్ లొకేషన్లో షూటింగ్ చేసేందుకు సినిమా ఇండస్ట్రీ ఒప్పుకోవడం లేదు.  ఎందుకంటే ఇప్పటికే 70కి పైగా దేశాల్లో కరోనా ప్రభావం ఉన్నది.  గల్ఫ్ దేశాల్లో కూడా దీని ఉన్న సంగతి తెలిసిందే.  గల్ఫ్ తో పాటుగా అటు యూరప్ లో కూడా వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.  చైనా మొదలు కొరియా, తైవాన్, ఇండోనేషియా, మలేషియా,హాంగ్ కాంగ్, జపాన్, ఆస్ట్రేలియా  వంటి దేశాల్లో వైరస్ ప్రభావం కనిపిస్తోంది.  


అందుకే వైరస్ నుంచి ఇబ్బందులు తొలగిపోయేంత వరకు కూడా ఫారెన్ లొకేషన్లలో సినిమా షూటింగ్ చేయడానికి భయపడుతున్నారు.  ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా ప్రవేశించడంతో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.  హైదరాబాద్ లో ఇప్పటికే ఒకకేసు నమోదైంది.  కొంతమంది ఆబ్సెర్వేషన్ లో ఉన్నారు.  పూణే నుంచి రిపోర్టులు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదని వైద్యులు చెప్తున్నారు.  కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ ప్రపంచాన్ని ఇంతలా భయపెడుతుందని ఎవరూ ఊహించలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: