నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తన 106వ సినిమాను మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటివలే ఓ ఫైట్ సీన్ తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. అయితే ఈ సినిమా విషయంలో బాలకృష్ణ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. బడ్జెట్ దగ్గర నుంచీ క్యాస్టింగ్, టెక్నీషియన్ల వరకూ అన్నింటినీ జాగ్రత్తగా తన కనుసన్నల్లో జరిగే విధంగానే ప్లాన్ చేసుకున్నాడట.

 

 

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకోవాలనేది కూడా బాలయ్య నిర్ణయమేనంటున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రామ్ ప్రసాద్ ను తీసుకున్నారు. రామ్ ప్రసాద్ తో బాలయ్యకు మంచి రాపో ఉంది. లెజెండ్, జైసింహ, రూలర్.. వంటి సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. అయితే రూలర్ విషయంలో రామ్ ప్రసాద్ వర్క్ పై బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశాడనే టాక్ అప్పట్లో వచ్చింది. దీంతో బోయపాటి దర్శకత్వంలో సినిమాకు రామ్ ప్రసాద్ ను పక్కన పెట్టాలని చూశారని ఓ వార్త ఫిలిం నగర్ లో రౌండ్ అవుతోంది. అయితే ఇప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య ఈ విషయంలో చాన్స్ తీసుకునే ప్రయత్నం చేయలేదట.

 

 

కేఎస్ రవికుమార్ క్వాలిటీ గురించి ఆలోచించకుండా హడావిడిగా సినిమా తీయడం వల్లే రూలర్ లో బాలయ్య లుక్ దెబ్బతిందని నిర్ణయానికి వచ్చే మళ్లీ రామ్ ప్రసాద్ ను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాడట బాలయ్య. సినిమాను కూడా భారీ బడ్జెట్ లేకుండా ఎంత తక్కువకు అయితే అంతలో తన మార్కెట్ రేంజ్ ను బట్టే తీయాలని బోయపాటికి ముందే సూచించాడని టాక్. గత ఏడాదంతా వరుస ఫ్లాపులు చేసిన బాలకృష్ణ బోయపాటి సినిమాతో అయినా గట్టెక్కుతాడేమో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: