ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయంపై నటీమణులు గతంలో తమకు ఎదురైన ఛేదు అనుభవాలు.. లైంగిక వేధింపుల గురించి గళమెత్తుతున్నారు.  ఇప్పటికే మీ టూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్ నటి తనూ శ్రీదత్తా గతంలో తనపై ప్రముఖ నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులు చేశాడుని సంచలన వ్యాఖ్యాలు చేసింది. దాంతో ఆమెకు కొంత మంది నటీమణులు మద్దతు తెలిపినా.. మరికొంత మంది మాత్రం నానా పటేకర్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ఆయనకు మద్దతు పలికారు.  ఇక కాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్ ని షేక్ చేసింది శ్రీ రెడ్డి. 

 

మాలీవుడ్ లో ప్రముఖ రచయితపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి మరో సినీ నటి తన అనుభవాలు మీడియాతో పంచుకున్నారు.  బుల్లితెర పై తన కెరీర్ ప్రారంభించిన నటి  రష్మీ దేశాయ్‌  తర్వాత వెండి తెరపై ఛాన్సులు కొట్టేసింది.  ఆ సమయంలో తనను సూరజ్‌ అనే వ్యక్తి  లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలిపింది.  అయితే ఈ విషయం తన తల్లికి చెప్పడంతో అతన్ని అందరి ముందు చెంప  చెంప ఛెళ్లుమనిపించిందని చెప్పింది.  పదమూడేళ్ళ క్రితం తను కెరీర్ ప్రారంభిచానని.. ఆ సమయంలో ఇండస్ట్రీలో రాణించాలంటే..  క్యాస్టింగ్ కౌచ్‌కు ఒప్పుకోవాలని సూరజ్ అనే వ్యక్తి తనను బలవంతం చేశాడని అన్నారు.

 

ఆ సమయంలో ఆడిషన్స్ ఉన్నాయని తనకు ఫోన్ చేసి ఓ ప్లేస్ కి రమ్మన్నారని తెలిపింది.  తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తాను మత్తుమందు కలిపిన పానియం ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడని.. ఎలాగో అలా అక్కడ నుంచి తప్పించుకొని బయట పడ్డానని చెప్పింది.  ఈ విషయం తన తల్లికి చెప్పడంతో  సూరజ్‌ దగ్గరికి వెళ్లానని, అతడిని చెంపదెబ్బ కొట్టిందని వివరించింది.  జీవితంలో ఇలాంటి సమస్యలు తలెత్తనిపుడు భయపడకుండా వారికి సరైన బుద్ది చెప్పాలని సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: