తెలుగు ప్రేక్షకులందరికీ ఏ హీరో హీరోయిన్ అయిన తెలియకుండా వుంటారేమో కానీ.. శ్రీ రెడ్డి మాత్రం తెలియకుండా ఉండదు. శ్రీరెడ్డి సినిమాల్లో నటించకపోయినప్పటికీ శ్రీ రెడ్డి పేరు మాత్రం సినీ ప్రేక్షకులు అందరికీ తెలుసు. సినిమాల కంటే శ్రీరెడ్డి వివాదాలతోనే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం. ముఖ్యంగా మీటు ఉద్యమం పేరుతో శ్రీరెడ్డి టాలీవుడ్లో చేసిన చర్చ మామూలుది కాదు. ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ ముందు ఈ అమ్మడు చేసిన అర్ధనగ్న ప్రదర్శన అందరినీ ఆకర్షించింది అని చెప్పాలి. అయితే శ్రీ రెడ్డి కి ఎవరైనా నచ్చారూ అనుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరి ఏమనుకుంటారో అని భయపడకుండా బంపర్ ఆఫర్ లు ఇస్తూ ఉంటుంది. 

 

 

 ఇప్పటికే మొన్నటికి మొన్న..వర్మ తో  ఓ రోజు డేటింగ్ చేయాలని ఉంది అంటూ సంచలనంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పెద్ద దుమారమే రేపింది శ్రీ రెడ్డి. గత కొన్ని రోజుల ముందు వైసిపి యువ నేత అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి ఒక రోజు పెళ్ళాం గా ఉండాలని ఉంది అంటూ శ్రీ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వర్మ  తో డేటింగ్ చేయాలి అన్నప్పుడు వర్మ స్పందించకుండా ఎలా ఉంటాడు  చెప్పండి. శ్రీ రెడ్డి గత కొంత కాలం నుంచి వివాదాలలో ఉంటే... వర్మ  మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి వివాదాలతోనే జీవిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వర్మ  ఓ వీడియో ఛానల్ కు  ఇంటర్వ్యూలో... శ్రీరెడ్డి ఆఫర్ ఇచ్చిన డేటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

 

 

 శ్రీరెడ్డి మీతో డేటింగ్ చేయాలని ఉంది  అని ఆఫర్ ఇచ్చింది. దానికి మీరు ఏమంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. మామూలుగా డేటింగ్ అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఓ రెస్టారెంట్ కు లేదా ఇంకో చోటుకు వెళ్లడం లాంటిది అని  తెలిపిన వర్మ తానైతే ఏ అమ్మాయితో ఆయన బయటకు వెళ్లను అని ఒకవేళ వెళ్తే అది గది లోపలికి మాత్రమే అంటూ సంచలన జవాబు ఇచ్చాడు. అయితే అది శ్రీరెడ్డి కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు కానీ నేను మాత్రం బయటకు వెళ్లాను గది లోపలికి వెళ్తాను అంటూ చెప్పుకొచ్చాడు. మరి శ్రీరెడ్డి దృష్టిలో డేటింగ్ అంటే ఏమిటో తెలియదు కానీ నా దృష్టిలో మాత్రం డేటింగ్ అంటే అదే అని క్లియర్ గా చెప్పేశాడు. మరి దీనిపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో అన్నది కూడా ప్రస్తుతం అందరికీ ఆసక్తికరం గా మారిపోయింది.అయితే వీరిద్దరి కామెంట్స్ పై మాత్రం నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. మీ ఇద్దరికీ డేటింగ్ చేసుకోవాలి అనిపిస్తే చేసుకోండి కానీ దానిని పదిమందిలో పెట్టి... రచ్చ చేయడం ఎందుకు అని అంటున్నారు. సీక్రెట్ విషయాలన్నీ బయటకు చెప్పేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: